ఆమెను 'సీఎం.. మంత్రులు' అలా వాడేశారట

ఆమెను 'సీఎం.. మంత్రులు' అలా వాడేశారట

కేరళలో సంచలనం స ష్టించిన సోలార్‌ కుంభకోణంలో.. నాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ ఎంతగా అప్రదిష్ట పాలయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమెన్‌ చాందీ ఇమేజ్‌ మొత్తాన్ని పెద్ద ఎత్తున డ్యామేజ్‌ చేసిన ఉదంతాల్లో సరితా నాయర్‌ ఇష్యూ ఒకటి. తాజాగా ఒక చీటింగ్‌ కేసుకోవటం కోయంబత్తూరు కోర్టుకు హాజరైన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనను మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీతో పాటు మంత్రులు లైంగికంగా వాడుకున్నట్లుగా ఆమె వెల్లడించారు. ఉమెన్‌ చాందీతో పాటు మరో నలుగురు తనను లైంగికంగా వాడేసుకున్నారని.. ఆ తర్వాత తనతో ఆర్థిక నేరాలు చేయించినట్లుగా తీవ్ర విమర్శలు చేశారు. కేరళ ఆర్థికమంత్రి పళని మాణిక్యం ఒక ఐటీ కేసుకు సంబంధించి తనను కోటి రూపాయిలు లంచం డిమాండ్‌ చేస్తే తాను రూ.25 లక్షలు ఇచ్చినట్లుగా వెల్లడించారు.

రూ.70 కోట్ల సోలార్‌ కుంభకోణానికి సంబంధించి తమిళం.. మలయాళంలో సినిమాలు తీయటంతో పాటు.. ఆటోబయోగ్రఫీ రాయనున్నట్లుగా సరితా నాయర్‌ వెల్లడించారు. తన మాటలతోనే సంచలనం స ష్టించిన ఆమె వ్యవహారం పుస్తకం.. సినిమాల రూపంలో వస్తే.. అదెంత సంచలనంగా మారుతుందో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు