ఆ పాకిస్థాన్‌ హాట్‌ మోడల్‌ను చంపేశారు

ఆ పాకిస్థాన్‌ హాట్‌ మోడల్‌ను చంపేశారు

కొన్ని నెలల కిందట టీ20 ప్రపంచకప్‌ జరిగినపుడు.. ఇండియా మీద పాకిస్థాన్‌ గెలిస్తే తాను పాకిస్థాన్‌ అభిమానుల ముందు న్యూడ్‌ డ్యాన్స్‌ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన కందీల్‌ బలోచ్‌ గుర్తుంది కదా. పాకిస్థాన్‌ పూనమ్‌ పాండేగా గుర్తింపు పొందిన ఈ హాట్‌ మోడల్‌ హత్యకు గురైంది. స్వయంగా ఆమె సోదరుడే గొంతు నులిమి ఆమెను చంపేసినట్లు పాక్‌ పోలీసులు చెబుతున్నారు. అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురి చేసిన ఈ హత్యోదంతం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

పాకిస్థాన్‌లో మత మౌఢ్యం గురించి.. కట్టుబాట్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కందీల్‌ బలోచ్‌ హత్యకు కూడా అదే కారణం. ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న కారణంతోనే ఆమెను సోదరుడు చంపేశాడు. రెవల్యూషనరీ స్టేట్మెంట్లకు పెట్టింది పేరైన కందీల్‌.. ఈ మధ్య పాకిస్థాన్‌లో మతం పేరుతో మహిళల హక్కుల్ని ఎలా కాలరాస్తున్నారో చెబుతూ సోషల్‌ మీడియాలో సంచలన పోస్టులు పెట్టింది.

అది చాలదన్నట్లు పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ మసీదు పెద్ద అయిన వ్యక్తి మీద తీవ్ర ఆరోపణలు చేసింది. అతనో స్త్రీలోలుడు అని చెబుతూ.. తనతో క్లోజ్‌గా ఉన్నపుడు దిగిన కొన్ని ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీనిపై పాకిస్థాన్‌లో తీవ్ర దుమారం రేగింది. కొందరు మత పెద్దల నుంచి కందీల్‌ కుటుంబానికి హెచ్చరికలు జారీ అయ్యాయి. నిజానికి కందీల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండట్లేదు. ఈ మధ్యే రంజాన్‌ పండుగ కోసమని తన ఇంటికి వెళ్లింది. ఈ సందఠంగానే తమ కుటుంబం పరువు తీస్తోందన్న కారణంతో సోదరుడే కందీల్‌ ప్రాణాలు తీసేసినట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English