చెప్పను బ్రదర్‌...నరేష్‌ క్లారిటీ ఇచ్చాడు...

చెప్పను బ్రదర్‌...నరేష్‌ క్లారిటీ ఇచ్చాడు...

అల్లరి నరేష్‌ కెరీర్‌ ఇప్పుడు నడిసంద్రంలో నావలా మిగిలింది. గతంలో వరస విజయాలతో ఇండస్ట్రీని అల్లాడించిన నరేష్‌.. ఇప్పుడు ఒక్క విజయం కావాలంటూ అల్లాడిపోతున్నాడు. 2012లో వచ్చిన సుడిగాడు తర్వాత ఈ హీరోకు ఒక్క హిట్టు కూడా లేదు. బాగున్నాయ్‌ అని టాక్‌ తెచ్చుకున్న బ్రదరాఫ్‌ బొమ్మాళి, యముడికి మొగుడు లాంటి సినిమాలు సైతం ఫ్లాపులుగానే మిగిలిపోయాయి.

గతేడాది విడుదలైన జేమ్స్‌ బాండ్‌ కు కూడా మంచి టాకే వచ్చింది. కానీ నరేష్‌ పై నమ్మకం లేక థియేటర్స్‌ వరకు కదల్లేదు ప్రేక్షకులు. ఆ తర్వాత మోహన్‌ బాబుతో కలిసి నటించిన మామమంచు అల్లుడు కంచు సైతం నిరాశపరిచింది. ఈ సినిమా నరేష్‌ 50 వ సినిమా. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా ఫ్లాపైంది. దాంతో ఇప్పుడు అల్లరోడి ఆశలన్నీ సెల్ఫీ రాజాపైనే ఉన్నాయి. సిద్ధు ఫ్రమ్‌ సికాకుళం ఫేమ్‌ ఈశ్వర్‌ రెడ్డితో ఈ సినిమా చేసాడు నరేష్‌. సెల్ఫీ  ఈ మధ్య ఎంత క్రేజ్‌ తెచ్చుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిపైనే ఇప్పుడు సెటైర్‌ వేస్తున్నాడు నరేష్‌. రెండు మూడు స్పూఫులు కూడా ఉన్నాయట. ఈ సినిమా జులై 15న విడుదల కానుంది.

అన్నట్టు ఇందులో బన్నీ మొన్న ఆడియో వేడుకలో చెప్పిన... చెప్పను బ్రదర్‌ కామెంట్‌ పై కూడా సెటైర్‌ వేసారు. అది ఎందుకు వేసామనేది సినిమా చూస్తే అర్థమౌతుందంటున్నాడు. 30 ఇయర్స్‌ పృధ్వి ఈ డైలాగ్‌ చెప్పాడు. బన్నీ తనను మంచి ఫ్రెండ్‌ అని... ఏ సినిమాలో అయినా హీరోల్ని ఎక్కువ చేసి చూపించానే తప్ప పరువు తీయలేదన్నాడు.  సెల్‌ా కాన్పిడెన్స్‌ తో ఉన్న అల్లరోడి పరాజయాల పరంపరంకు సెల్ఫీ రాజా బ్రేకులేస్తుందో లేదో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు