ఏపీ బీజేపీలో కులం చిచ్చు..!

ఏపీ బీజేపీలో కులం చిచ్చు..!

దాదాపు అన్ని పార్టీల్లోనూ ఉన్న కులం కార్డు పిచ్చి తాజాగా క‌మ‌ల ద‌ళానికి కూడా పాకింది. ఏపీ బీజేపీలోని రెండు ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాల మ‌ధ్య ప‌రిస్థితి ఇప్పుడు ఉప్పు, నిప్పులా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఒక‌టి రెండు పార్టీల్లోనే క‌నిపించిన ఈ కుల పిచ్చి.. బీజేపీకి చేర‌డంపై

రాజ‌కీయ‌వ‌ర్గాలు సైతం ఆస‌క్తితో ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తున్నాయి. ఇంత‌కీ ఈ గొడ‌వ‌కు కార‌ణంపై దృష్టి సారిస్తే.. ఏపీ బీజేపీ అధ్య‌క్ష పీఠం కోస‌మే వీరంతా కులం కార్డుల‌తో త‌మ‌లో తామే కొట్టుకు చస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

 ఏపీ బీజేపీ అధ్య‌క్ష పీఠానికి అభ్య‌ర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం, సాధ్య‌మైన‌న్ని ఎక్కువ స్థానాల‌ను కైవ‌సం చేసుకోవడం, అవ‌స‌ర‌మైతే చంద్ర‌బాబుకు సైతం చెక్‌పెట్టే స్థాయికి ఎద‌గ‌డం వంటివి క‌మ‌లం పార్టీ అధిష్టానం పెట్టుకున్న‌ల‌క్ష్యాలు . ఈ క్ర‌మంలో వీటిని సాకారం చేయ‌గ‌ల నేత కోసం ఆ పార్టీ అన్వేషిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రస్తుతం పార్టీ ప‌గ్గాలు ప‌ట్టుకున్న కంభంపాటి హ‌రిబాబు ప‌ద‌వీకాలం తీరిపోయింది.దీంతో ఆయ‌న స్థానంలో మ‌రొక‌రిని నియ‌మించాల్సి ఉంది. ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీలో కుంప‌టి రాజేసింది.

 పార్టీలోని కమ్మ‌, కాపు కులాల నేత‌ల మ‌ధ్య వివాదానికి దారి తీసింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో కొన్నాళ్లుగా కాపు ఉద్య‌మం సాగుతున్న క్ర‌మంలో ఆ వ‌ర్గం వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌నే డిమాండ్ ఊపందుకుంది. ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా ఉన్న కంభంపాటి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వాడు కావ‌డం, తిరిగి మ‌రోద‌ఫా అధ్య‌క్ష పీఠాన్ని ఆశిస్తుండ‌డం, ఈయ‌న‌కు ఆ పార్టీలోని క‌మ్మ సామాజిక వ‌ర్గానికే చెందిన కేంద్ర మంత్రి వెంక‌య్య‌, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస‌రావుల అండ పుష్క‌లంగా ఉంది.

   మ‌రోప‌క్క‌ కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజు లేదా కన్నా లక్ష్మీనారాయణకు అవకాశం ఇస్తే ఆ వర్గం బీజేపీకి దగ్గరవుతుందని కాపు నాయకులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నూరిపోశారు. అంతేకాకుండా కాపు వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, ఆకుల సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు వంటి నేతలంతా ఈ విషయంలో ఒక్కటయ్యారని సమాచారం. మొత్తానికి.. ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయం బీజేపీ అధినాయకత్వానికి సరికొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఎప్పుడో జ‌ర‌గాల్సిన అధ్య‌క్ష ఎంపిక కూడా అధిష్టానం వాయిదా వేస్తూ వ‌స్తోంద‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు