వైఎస్ జ‌యంతి రోజే జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్‌

వైఎస్ జ‌యంతి రోజే జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్‌

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు మ‌రోమారు కోర్టు రూపంలో చుక్కెదురు అయింది. ఆయన తండ్రి దివంగ‌త వైఎస్ జ‌యంతి సంద‌ర్భంగా చేదువార్త వినాల్సి వ‌చ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

దాదాపు 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవ‌లి కాలంలో టీడీపీకి గూటికి చేరిన సంగతి తెలిసిందే. పార్టీ మారిన త‌మ ఎమ్మెల్యేల అనర్హతపై వైకాపా నేతలు ఇటీవల ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. వైకాపా ఇచ్చిన నోటీసు నిబంధనల ప్రకారం లేదని సభాపతి తిరస్కరించారు. మ‌రోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు ఈ అంశం ప‌రిష్కారం  హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కేసు విచారణను హైకోర్టు త్వరగా పూర్తి చేస్తుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ప‌రిపాల‌న తీరును నిర‌సిస్తూ నేటి నుంచే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ అనే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ క్ర‌మంలో అనర్హ‌త అంశం ఒక‌టి. అయితే అదే ప‌రిణామంపై సుప్రీంకోర్టులో చుక్కెదురవ‌డం జ‌గ‌న్‌కు షాక్ వంటిద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు