ఆ మంత్రులకు పక్కలో బల్లాలను తెచ్చిన మోడీ

ఆ మంత్రులకు పక్కలో బల్లాలను తెచ్చిన మోడీ

ప్రధాని మోడీ మంత్రివర్గంలో చేసిన మార్పులపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో పక్కా వ్యూహంతో కూర్పు జరిగిందంటున్నారు. అయితే.. పార్టీ పరమైన ప్రయోజనాల కోసమే కాకుండా అందులో మోడీ మార్కు గేమ్‌ ప్లాన్‌ కూడా ఉందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఎవరినీ ఎదగనివ్వకుండా.. ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వకుండా.. కీలక నేతలందరికీ వారివారి శత్రువులను తెచ్చి మంత్రివర్గంలో పెట్టారని తెలుస్తోంది. మంత్రివర్గంలోనే స్పీడు బ్రేకర్లు ఉండేలా ప్లాను చేశారని వినిపిస్తోంది.

    ముఖ్యంగా ఈ విస్తరణలో సుష్మాస్వరాజ్‌, నితిన్‌ గడ్కరీల బద్ధ శత్రువులకు చోటు దొరికింది. అంతేకాదు... స్మ తి ఇరానీకి కూడా పోటీగా అనుప్రియ పటేల్‌ అనే ఛరిష్మాటిక్‌ లీడర్‌ వచ్చింది. ఆమెను ఏకంగా యూపీ సీఎం కేండిడేట్‌ గా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతుండడంతో స్మ తికి ప్రాధాన్యం తగ్గబోతోందని అర్థమవుతోంది. తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఇరానీ వ్యవహార శైలిని కొద్దికాలంగా నిశితంగా గమనించిన మోడీ ఆమె స్పీడుకు బ్రేకులేసేందుకే అనుప్రియను తెచ్చినట్లుగా చెబుతున్నారు.

    విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్‌ కు పక్కలో బల్లెంలా ఆ శాఖ సహాయ మంత్రిగా ఎంజే అక్బర్‌ ను తెచ్చిపెట్టారని చెబుతున్నారు. ఆ కారణంగానే అలక వహించిన ఆమె ఏదో కారణం చెప్పి విస్తరణ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది.  తనకు చెక్‌ పెట్టేందుకే మోదీ... ఎంజే అక్బర్‌ ను తన శాఖకు తీసుకువచ్చారని సుష్మా భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆమె నిన్నటి కేబినెట్‌ విస్తరణకు హాజరుకాలేదన్న వాదన వినిపిస్తోంది. అలాగే డార్జిలింగ్‌ లోక్‌సభ ఎంపీ సురేంద్రజిత్‌ సింగ్‌ అహ్లువాలియాకు మంత్రివర్గంలో స్థానమివ్వడంపైనా నితిన్‌ గడ్కరీ అసంత ప్తిగా ఉన్నారు. అహ్లూవాలియా సుష్మా స్వరాజ్‌, అద్వానీ వంటివారికి సన్నిహితులే కానీ ఆయనకు గడ్కరీతో విభేదాలున్నాయి. అలాగే సదానంద గౌడకు చెక్‌ పెట్టేందుకు కరా?టక నుంచి మరో నేతను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇలా మోడీ తన మంత్రులను స్థిమితంగా ఉండనివ్వకుండా ఎక్కడికక్కడ చెక్‌ పెడుతున్నారన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు