అవును, ఆ ఉగ్రవాదులకు సాయం చేస్తా: ఎంపీ

అవును, ఆ ఉగ్రవాదులకు సాయం చేస్తా: ఎంపీ

హైదరాబాద్ మహా నగరంలో భారీ ఉగ్రదాడికి పన్నాగం పన్ని.. కనివిని ఎరుగని మారణహోమానికి ప్లాన్ చేసిన ఐసిస్ ఉగ్రవాదుల సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ.. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయటం తెలిసిందే. ఉగ్రవాద సానుభూతి పరులుగా పోలీసుల అదుపులో ఉండి.. ప్రస్తుతం విచారణలో ఉన్న నిందితులకు న్యాయసహాయం చేస్తానని ప్రకటించిన మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై విమర్శలు ఏ స్థాయిలో వచ్చాయో తెలిసిందే. అయినప్పటికీ.. ఆయన తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గకపోవటం గమనార్హం.

ఐసిస్ మీద తన వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే.. మరోవైపు ఐసిస్ సానుభూతిపరులుగా అరెస్ట్ అయిన వారికి న్యాయ సాయం అందిస్తామని పేర్కొనటం గమనార్హం. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతిపరులైన ఐదుగురు.. తాము వేసిన ప్లాన్.. అందుకు తాము చేసిన కసరత్తుతో పాటు.. తాజాగా అధికారులు చేపట్టిన సోదాల్లో బుల్లెట్లు.. ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోటం తెలిసిందే. అరెస్ట్ సమయంలో వారి వద్ద నుంచి కీలక ఆధారాల్ని సేకరించినప్పటికీ.. మజ్లిస్ అధినేత మాత్రం వారకి తాము న్యాయసాయం అందిస్తామని చెబుతూ మద్దతుగా నిలుస్తామని పేర్కొనటం విశేషం.

ఐసిస్ సానుభూతిపరులన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురికి సాయంగా నిలుస్తామన్న ఆయన మాటపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కూడా అయిన పరిస్థితి. విమర్శలు వెల్లువెత్తినా వెనక్కి తగ్గకుండా తాను చెప్పిన మాట మీదనే నిలబడిన అసద్.. ఐసిస్ ను అంతం చేయాలంటూనే.. ఐసిస్ సానుభూతిపరులు (ప్రస్తుతం నిందితులుగా ఉన్నారు)గా చెబుతున్న వారికి న్యాయసాయం అందిస్తామని.. నిందితులకు న్యాయసాయం పొందటం నిందితుల హక్కుగా వెల్లడించారు. అదే సమయంలో దేశానికి శత్రువులు తమకు కూడా శత్రువులే అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని అన్నా.. అసద్ దారి అసద్ దే సుమా.​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు