ఆరున్న‌ర ల‌క్ష‌ల ఐటీ ఉద్యోగాలు ఊస్ట్‌

ఆరున్న‌ర ల‌క్ష‌ల ఐటీ ఉద్యోగాలు ఊస్ట్‌

వచ్చే ఐదేళ్లలో భారత ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల తెగ్గోత భారీగా జరగనుంది. యూఎస్ అధ్యయన సంస్థ ప్రకారం.. ఐటీ పరిశ్రమలో ఆటోమిషన్‌ను అమలు చేయడం ద్వారా ఈ సెక్టార్‌లో పనిచేస్తున్న తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ సర్వే వెల్లడించింది. వీరి సంఖ్య 6.4 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. అయితే నాస్కామ్ దీన్ని తోసిపుచ్చింది. ఆటోమిషన్ రాకవల్ల కొంత ప్రభావం పడనుంది కానీ కొత్త టెక్నాలజీ వినియోగం వల్ల నూతన ఉద్యోగాల కల్పన సైతం జరుగుతదని పేర్కొంది.

ఇదిలాఉండ‌గా ఆటోమిషన్ కానీ రోబోటిక్స్ వినియోగం వ‌ల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ స్పేస్‌లో అదేవిధంగా బీపీవో రంగంలో తీవ్ర ప్రభావం పడనుంది. ఆటోమిషన్ అందుబాటులోకి రావ‌డం వల్ల ఒకవైపు తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు 30శాతం పడిపోనుండగా మరోవైపు మీడియం స్కిల్డ్ ఉద్యోగాలు 8 శాతం, అదేవిధంగా హై స్కిల్డ్ ఉద్యోగాలు 56 శాతం పెరగనున్నట్లు ఐటీ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఆటోమిష‌న్ ఐటీ పరిశ్రమను ఎలా లీడ్ చేయ‌డంతో పాటు డ‌ల్ కూడా చేసేస్తుంద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు