పేరు మర్చిపోయిన కేంద్ర మంత్రికి పంచ్‌

పేరు మర్చిపోయిన కేంద్ర మంత్రికి పంచ్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులుగా కొత్త వారిని నియ‌మించుకునే స‌మ‌యంలో ప‌ద‌నిస‌లు చోటుచేసుకున్నాయి. మోడీ టీంలో  కొత్త‌గా ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ఒక‌రైన రామ్‌దాస్ అథ‌వాలే మ‌ధ్య‌లో ఒక‌సారి త‌న ప్ర‌మాణ స్వీకారాన్ని ఆపాల్సి వ‌చ్చింది. అది కూడా రాష్ట్రప‌తి వ‌ల్ల కావ‌డం ఆస‌క్తిక‌రం. అందుకు కార‌ణం ఆ మంత్రి గారు త‌న పేరు మ‌ర్చిపోయారు మ‌రి.

అథ‌వాలే త‌న పేరు చెప్ప‌కుండానే ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం మొద‌లుపెట్టారు. వెంట‌నే స్పందించిన రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మీ పేరు చెప్పండంటూ ఆయ‌న‌కు సూచించారు. దీంతో సారీ.. సారీ అంటూ త‌న పేరు చెప్పి మ‌రోసారి ప్ర‌మాణస్వీకారం చేశారు. ఈ క్ర‌మంలో న‌వ్వులు విర‌బూశాయి. మ‌హారాష్ట్ర‌లోని రిప‌బ్లిక‌న్ పార్టీకి చెందిన అథ‌వాలే.. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో హాస్యాన్ని పండిస్తార‌ని పేరుంది. 2009కి ముందు ప‌దేళ్ల పాటు లోక్‌స‌భ ఎంపీగా ఉన్న ఆయ‌న‌.. గ‌తేడాది రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఎన్నిక‌య్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు