జగన్ పై మళ్లీ నీలినీడలు

జగన్ పై మళ్లీ నీలినీడలు

జగన్ కష్టాలు తొలుగుతున్నాయి, ఆయన జనాల్లోకి ఇక వస్తారు, పార్టీని పటిష్టం చేస్తారు, ప్రత్యర్థులను మట్టి కరిపిస్తారు అని ఎంత ఆశగా ఎదురుచూస్తున్న వైఎస్సార్ సిపి నేతలకు, జగన్ కుటుంబ సభ్యుల ఆశలు అంత సులువుగా నెరవేరే మార్గం కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పట్లో ఆ అవకాశాలు కనిపించటం లేదట, మరికొంతకాలం, అంటే, ఎంతో ఇప్పటికయితే తెలియనంత కాలం జగన్ జైల్లో ఉండక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జగన్ బెయిల్ పొందాలంటే ఆయన కేసుల దర్యాప్తు పూర్తికావాలి, చార్జి షీట్లన్నీ దాఖలు కావాలి, అప్పుడే ఆయన బెయిల్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం వుంటుంది. కాని ఈ అవకాశాన్ని సిబిఐ అంతర్గత వ్యవహారాలు దూరం చేసేలా ఉన్నాయి. జగన్ విషయంలో సుప్రీంకోర్టు విధించిన తుడి గడువు సెప్టెంబరుతో ముగుస్తోంది. ఆలోపు తుది చార్జిషీటును సిబిఐ దాఖలు చేయాలి, అప్పుడే జగన్ బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది.

అయితే ఆలోపే జగన్ కేసును దర్యాప్తు చేస్థున్న సిబిఐ డిఐజి వెంకటేశ్ పదవీ కాలం  ముగుస్తోందని తెలుస్తోంది. ఇప్పటి దాకా జగన్ కేసును విచారించిన జేడి లక్ష్మినారాయణ సైతం బదిలీపై వెల్లిపోయారు. ఆయన స్థానంలో అదనపు చార్టీ తీసుకున్నారు చెన్నై జేడి అరుణాచలం. కాని ఇప్పుడు వెంకటేష్ పదవీ కాలం కూడా ముగుస్తోంది.
కానీ, డిఐజి వెంకటేష్ స్థానంలో ఇప్పటికిప్పుడు ఫుల్ డిఐజి ని నియమించే అవకాశాలు లేవు. ఈయన స్థానాన్ని కూడా మరొకరికి అదనపు చార్జీ ఇవ్వడం ద్వారానే భర్తీ చేసే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. అంటే అప్పుడు సిబిఐ హైదరాబాద్ జోన్ పూర్థిగా ఇన్ చార్జిల పాలనలో ఉంటుంది. ఇన్ చార్జి అధికారులిద్దరికి జగన్ కేసు కొత్తే. పైగా ఇది కోర్టు పర్యవేక్షణలో జరుగుతోంది, కాబట్టి ఆషామాషీ గా విచారణ చేయలేరు. పైగా వారు ఇప్పటికే స్వయంగా డీల్ చేస్థున్న కేసులు ఉంటాయి. కాబట్టి జగన్ కేసులో తుదిచార్జి షీటు ఇప్పట్లో దాఖలయ్యే అవకాశాలు లేవని అంటున్నాయి సిబిఐ వర్గాలు. అయితే చార్జిషీటులన్నీ దాఖలయ్యేంత వరకు జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయవద్దని సుప్రీం కోర్టు స్వయంగా తెలిపింది. అందుకే జగన్ బెయిల్ కు మళ్లీ బ్రేకులు పడ్డట్టేనని, ఆయనకు ఇంకొన్నాళ్లు జైలు జీవితం తప్పదని అంటున్నారు న్యాయనిపుణులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు