జగన్ కు అంత ఆస్తి వుందా చినరాజప్ప

జగన్ కు అంత ఆస్తి వుందా చినరాజప్ప

ఏపీ హోం మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేరుకు హోం మంత్రే కానీ..కీలకమైన అంశాల గురించి చినరాజప్ప నోటి నుంచి పెద్దగా రావన్న విమర్శ ఒకటి ఉంది. రెండురోజుల క్రితం జగన్ ఆస్తుల్ని ఈడీ తాత్కాలిక అటాచ్ చేయటం తెలిసిందే. వీటి విలువ రూ.749 కోట్లుగా చెప్పినప్పటికీ.. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.4 నుంచి రూ.5వేల కోట్ల వరకూ ఉంటాయని చెబుతారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ ఈడీ జఫ్తు చేసిన జగన్ ఆస్తుల విలువ వందల కోట్లే కానీ.. వేల కోట్లలో ఉన్నట్లుగా కనిపించదు.

కానీ.. తాజాగా ఏపీ హోంమంత్రి మాత్రం ఈడీ జఫ్తు చేసిన జగన్ ఆస్తుల విలువ గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇప్పటివరకూ ఈడీ జఫ్తు చేసిన జగన్ ఆస్తుల విలువ రూ.46 వేల కోట్లుగా చెప్పారు. రానున్నరోజుల్లో మరిన్ని అక్రమాస్తులు బయటకు వస్తాయని చెప్పారు. బయటకు రావాల్సిన ఆస్తుల లెక్కను పక్కన పెడితే.. ఇప్పటివరకూ నాలుగు దఫాలుగా ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ఇంత భారీగా అన్నది చినరాజప్ప మాటల్లో కనిపిస్తుందే తప్పించి.. ఈడీ అధికార ప్రకటనల్లో కనిపించదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

మరి.. చినరాజప్ప వారు చెప్పిన రూ.46వేల కోట్లు మార్కెట్ వాల్యూను లెక్కేసి చెప్పారా? అన్నది ఒక ప్రశ్న. ఈ ఆస్తుల లెక్కతో పాటు.. మరో విచిత్రమైన విషయాన్ని కూడా చినరాజప్ప చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగన్ ప్రతిపక్ష నేత కూడా లేదని.. ఆయనకు ప్రతిపక్ష్ హోదా  లేదన్న విషయాన్ని జగన్ పార్టీ నేతలు గుర్తించాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ విపక్ష నేతగా ఉన్న జగన్.. ఏ విధంగా కాదో చినరాజప్ప మరికాస్త వివరంగా వివరిస్తే బాగుంటుందేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు