ఏపీ ప్రభుత్వం జగన్ కు ఇల్లు కట్టిస్తుందట..

ఏపీ ప్రభుత్వం జగన్ కు ఇల్లు కట్టిస్తుందట..

ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి  విపక్ష వైసీపీ అధినేత జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ కోరుకుంటే నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో మంచి ఇల్లు కట్టించి ఇస్తామని అన్నారు. అది కూడా ప్రభుత్వమే కట్టించి ఇస్తుందని.. అందుకు ఏమాత్రం ఆలస్యం చేయదని కేఈ అన్నారు. కేఈ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో కేఈ వెటకారంగా ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లోని లోటస్ పాండ్, బెంగళూరులోని మంత్రి టవర్స్ లోని జగన్ నివాసాలను ఈడీ అటాచ్ చేయడంతో కేఈ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇంకా రాష్ట్రానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉండాల్సిన అవసరం లేదని... ఆయన సొంత రాష్ట్రానికి రావాల్సిన టైమొచ్చిందని కేఈ అంటున్నారు.  జగన్ కనుక వస్తే అమరావతిలో ఇల్లు కట్టించి ఇస్తామని కూడా కేఈ చెప్పారు. ప్రతిపక్ష నేతకు నివాసం ఇవ్వడానికి తమ ప్రభుత్వం ఏమాత్రం సంశయించదని ఆయన తెలిపారు.

 సండూర్‌ పవర్‌ ప్రాజెక్టు పెట్టు బడులకు సంబంధించి మనీ లాండరింగ్‌ జరిగిందని నిర్ధారణకు వచ్చిన ఈడీ బుధవారం జగన్‌, ఆయన సతీమణి భారతికి సంబంధించిన చర, స్థిరా స్తులను అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే. భారతి ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలో ఉన్న అనే క ఆస్తులను గుర్తించి మనీ లాండరింగ్‌ కేసు కింద సుమారు రూ.749 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. ఈ ఆస్తులు బహిరంగ మార్కెట్లో 5 వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే గతంలో నాలుగు విడతలుగా జగన్‌ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి విడతగా రూ.200 కోట్లు, రెండవ విడతలో రూ.43 కోట్లు, మూడవ విడతలో రూ.225 కోట్లు, నాలుగోసారి రూ.750 కోట్లు అటాచ్‌ చేసింది.

 దీంతో జగన్ ఆర్థిక మూలాలపై దెబ్బ పడడంతో కేఈ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. జగన్ కోరితే అమరావతిలో ఇల్లు ఇస్తామని ఆయన అనడం వెనుక చాలా పెద్ద అర్థం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కష్టాల్లో చిక్కుకున్నందున తమను ఆశ్రయిస్తే హెల్పు చేస్తాం అన్న సంకేతాలిచ్చారని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంతో కొట్లాట మానుకుని సరెండర్ అయిపోతే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న ఉద్దేశం కేఈ మాటల్లో కనిపిస్తోందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు