కిరణ్‌కి ఆ ధైర్యమున్నదా?

కిరణ్‌కి ఆ ధైర్యమున్నదా?

రాష్ట్రంలో మంత్రివర్గ మార్పులు, చేర్పులు జరగవచ్చన్న మళ్లీ ఊహాగానాలు వస్తున్నాయి. పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ డిల్లీలోనే ఉండడం, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా డిల్లీ వెళ్లవచ్చనే ప్రచారం జరుగుతుండడంతో ఈ కదనాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

ఇంకో ఆసక్తికర అంశమేమంటే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి మంత్రులు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమవుతున్నార్ట. చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయి అసమ్మతి ముద్రపడ్డ మంత్రి రఘువీరారెడ్డి ఢిల్లీలో సోనియాగాంధీని కలిశారు. ఈ భేటీ పలు అనుమానాలను రేకెత్తిస్తున్నది. జగన్‌ కేసులో ఇరుక్కున్న మంత్రులను తొలగించడంతో పాటు, అసమ్మతి మంత్రులుగా కొరుకుడుపడని వారిని కూడా మార్చడానికి కిరణ్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నార్ట. ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను తొలగించాలని అధిష్టానం ఇప్పటికే కిరణ్‌రెడ్డికి సూచించిందట కూడాను.

ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రుల పరిస్థితి కూడా అనుమానమే. కాని మంత్రి వర్గ విస్తరణ లేదా, ప్రక్షాళన ఈ రెండిటిలో ఏది చేసినా కాంగ్రెసు పార్టీలో అసమ్మతి పెరిగే అవకాశముంటుంది. ఏదేమైనా తన క్యాబినెట్‌ విషయంలో ఏమీ చేసే ధైర్యం కిరణ్‌ రెడ్డికి ఉన్నట్లుగా కనిపించడంలేదు. బాధ్యత అధిష్టానం తీసుకుంటే ఏదైనా జరగవచ్చును.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు