కేసీఆర్ కు వాట్సప్ మెసేజ్ వస్తే..?

కేసీఆర్ కు వాట్సప్ మెసేజ్ వస్తే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ మేనమామ కేసీఆర్ గురించి తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఎక్కడున్నా ఆయన పని తీరు ఎలా ఉంటుందనటానికి తాజాగా హరీశ్ రావు చెప్పిన మాట ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. మిగిలిన వారి మాదిరే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాట్సప్ వాడుతున్నట్లు హరీశ్ మాటలతో అర్థమవుతుంది.

ఆయన వాట్సప్ లో వచ్చే మేసేజ్ ల విషయంలో కేసీఆర్ చాలా అలెర్ట్ గా ఉంటారని.. తన వాట్సప్ అకౌంట్ కి వచ్చే మెసేజ్ ల విషయంలో ఆయన తమను పరుగులు పెట్టించి మరీ పనులు చేయిస్తారని చెప్పారు. తన దృష్టికి వచ్చే ఏ అంశం మీద అయినా ఆయన ఫాలో అప్ ఎక్కువని.. పని పూర్తి అయ్యే వరకూ వెంటాడతారన్నట్లుగా హరీశ్ చెప్పుకొచ్చారు. సో.. సమస్యలున్న వారు వాటి పరిష్కారంకోసం వెతికే కన్నా.. కేసీఆర్ వాట్సప్ నెంబర్ ను తెలుసుకొని అందులో మెసేజ్ పెడితే.. ఇట్టే సమస్య సాల్వ్ అవుతుందన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు