నో పాలిటిక్స్‌ అన్న లగడపాటి

నో పాలిటిక్స్‌ అన్న లగడపాటి

రాష్ట్ర విభజన జరిగి.. తెలంగాణ రాష్ట్రం కానీ ఏర్పడితే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని శపధం చేయటమే కాదు.. చెప్పిన మాటకు తగ్గట్లే రాజకీయాలకు దూరంగా ఉండిపోవటం మాజీ కాంగ్రెస్‌ నేత లగడపాటి రాజగోపాల్‌ కే చెల్లింది. రాజకీయ నేతల నోటి నుంచి వచ్చే సవాళ్లు.. శపధాలు ఎలా ఉంటాయో తెలిసినవే అయినా.. అందుకు భిన్నంగా మాటంటే మాటే అన్న చందంగా లగడపాటి వ్యవహరిస్తున్నారు.

విభజన జరిగి రెండు సంవత్సరాలు పూర్తి అయినా.. ఆయన మాత్రం రాజకీయాల జోలికి వెళ్లటం లేదు. ఎక్కడైనా కనిపించినా.. పాత పరిచయంతో మీడియా ఆయన దగ్గరగా వెళ్లి పలుకరించినా.. నవ్వుతూ మాట్లాడతారే తప్పించి.. రాజకీయం గురించి మాట్లాడేందుకు.. ప్రస్తుత పరిస్థితుల మీద స్పందించేందుకు ఆయన సుతారం ఇష్టపడటం లేదు.

తాజాగా కొత్త స్కోడా కారు కొన్న లగడపాటి.. దాని రిజిష్ట్రేషన్‌ కోసం ఖైరతాబాద్‌ ఆర్టీవోఆపీసుకు వచ్చారు. ఈ సందఠంగా తెలంగాణ.. ఏపీ అధికారులతో మాట్లాడిన ఆయన్ను మీడియా పలుకరించింది. నవ్వుతూ వారికి హాయ్‌ చెప్పారేకానీ.. రెండు తెలుగురాష్ట్రాల్లోని అంశాలపై మాట్లాడేందుకు మాత్రం ఆయన ససేమిరా అన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. ఇప్పుడు తాను రాజకీయాల గురించి మాట్లాడితే బాగుండదన్నారు. మొత్తానికి చెప్పిన మాట మీదే ఉంటున్న లగడపాటి ఇంకెంత కాలం తాను చెప్పినట్లే రాజకీయాలకు దూరంగా ఉంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English