ఆ ఎమ్మెల్యే కేసీఆర్ కే షాకిచ్చాడట

ఆ ఎమ్మెల్యే కేసీఆర్ కే షాకిచ్చాడట

పార్టీ అధినేతలకే షాకుల మీద షాకులు ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు తగిలిన షాక్ గురించి చెప్పారు. కాకుంటే.. అది స్వీట్ షాక్ కావటం వేరే విషయం. తాజాగా కాంగ్రెస్ ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ సీనియర్ నేతలు వివేక్.. వినోద్ లు కారు ఎక్కటం తెలిసిందే. వీరితో పాటు నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే.. సీపీఐకి చెందిన రవీంద్ర నాయక్ కూడా పార్టీలో చేరారు.

అయితే.. ఈ విషయం పెద్దగా ఫోకస్ కాలేదు. గుత్తా.. వివేక్.. వినోద్ లాంటి అగ్రనేతల చేరిక నేపథ్యంలో దేవరకొండ ఎమ్మెల్యే చేరి అందరి దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారో ఏమో కానీ.. తనదైన శైలిలో ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు. కాంగ్రెస్ నేతలతో కలిసి వచ్చి పార్టీలో చేరిన సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన కేసీఆర్.. ఆయన పార్టీలో చేరుతున్న విషయం తనకు తెలీదంటూ అందరిని సర్ ప్రైజ్ చేశారు. పార్టీలో చేరుతున్న విషయం తనకు తెలీకుండా చేరటం అద్భుతం అన్న మాట కేసీఆర్ చెప్పటంతో అప్పటివరకూ రవీంద్ర నాయక్ మీద ఎవరి ఫోకస్ పడని దానికి భిన్నంగా అందరూ ఆయన్నే చూసే పరిస్థితి. ఎవరిని ఎప్పుడు ఎలా ఎత్తాలో.. ఎవరిని ఎలా పడేయాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికి తెలీదేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు