ఆ ఎమ్మెల్యేకు జగన్ మీటింగ్ కంటే ఈనాడు ప్రోగ్రామ్ ఎక్కువా..!

ఆ ఎమ్మెల్యేకు జగన్ మీటింగ్ కంటే ఈనాడు ప్రోగ్రామ్ ఎక్కువా..!

వైకాపా అధినేత వైఎస్.జగన్‌కు ఎప్పుడు ఎవరు ఎలా షాకిస్తారో కూడా తెలియడం లేదు. తాజాగా ఓ ఎమ్మెల్యే ఏపీలో తొలిసారి జరిగిన వైకాపా విస్తృతస్థాయి సమావేశానికి డుమ్మా కొట్టారు. జగన్ చాలా సీరియస్‌గా తీసుకుని నిర్వహించిన ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన సదరు ఎమ్మెల్యే ఎంచక్కా ఈనాడు దినపత్రిక ఆధ్వర్యంలో చేపట్టిన వన భారతి - జన హారతి కార్యక్రమానికి వెళ్లి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

 వైకాపా అధినేత జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి జగన్‌కు షాక్ ఇచ్చారు. మంగళవారం జగన్ ఏపీ రాజధాని కేపిటల్ విజయవాడలో తొలిసారిగా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. నవ్యాంధ్రలో విజయవాడ నుంచే పార్టీని బలోపేతం చేయాలని డిసైడ్ అయిన జగన్ ఇక్కడ తొలిసారిగా నిర్వహించిన సమావేశానికి రాష్ర్టం నలుమూలల నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా

పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పార్టీ పదవుల్లో ఉన్న వారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు భారీ ఎత్తున హాజరయ్యారు.

 టోటల్ ఏపీ వైకాపా మొత్తం బెజవాడలోనే ఉంది. ఇలాంటి కీలక సమావేశానికి డుమ్మా కొట్టిన ప్రసాద్‌రెడ్డి తన నియోజకవర్గంలోనే ఉన్నారు. అది కూడా ఆయన ఏదో పనిమీద బిజీగా ఉన్నారనుకుంటే పొరపాటే. ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈటీవీ ఛానెల్ చేపట్టిన వన భారతి- జన హారతి కార్యక్రమంలో తన నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. దీంతో కడప జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు ఆయన గురించి ఆరా తీసి అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారట.

 దీంతో ప్రసాద్‌రెడ్డి చూపులు టీడీపీ వైపు ఉన్నాయా అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లా నుంచి జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు కూడా ఇక్కడ ఎక్కువుగా కాన్సంట్రేషన్ చేస్తున్నందున ప్రసాద్‌రెడ్డి పార్టీ మారతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ఆయన ఇలాంటి కీలక సమావేశానికి ఎందుకు డుమ్మా కొడతారన్న ప్రశ్నలు కొందరు వైకాపా నాయకులు లేవనెత్తుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు