దాసరికి సిబిఐ 'బొగ్గు' ప్రశ్నలు

దాసరికి సిబిఐ 'బొగ్గు' ప్రశ్నలు

లక్షా తొంభై వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సంబందించి గతంలో కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావును సిబిఐ ప్రశ్నించినట్లుగా వెల్లడైంది. దాసరితో పాటు కేంద్రమంత్రిగా పనిచేసిన సంతోష్‌ బగ్రోడియా అనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన నేతను కూడా ప్రశ్నించినట్లు సిబిఐ వెల్లడించింది.

గతంలో దాసరి తనను ఎవరూ ప్రశ్నించలేదని పేర్కొన్నారు బొగ్గు కుంభకోణంపై ఆయనను అడిగితే. ఆ సమయంలో దాసరిని సిబిఐ ప్రశ్నించిందో, లేదో కాని, ఇప్పుడు సిబిఐ దాసరిని కూడా విచారించినట్లు చెప్పడంతో దాసరి పేరు ఈ కుంభకోణంలో ఇంకోసారి గట్టిగా వినిపించడం జరుగుతున్నది. విచారణలో దాసరి ఏం చెప్పారో వెల్లడి కావాల్సి ఉన్నది. దాసరి కేంద్ర సహాయమంత్రిగా పనిచేసినప్పుడూ అక్రమంగా కేటాయింపులు జరిగాయనే ఆరోపణలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు