ఇద్దరు సీఎంలు ఇరుకున పడ్డారే

ఇద్దరు సీఎంలు ఇరుకున పడ్డారే

పేర్లలోనే కాదు చాలా అంశాల్లోనూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చాలా విషయాలు కలుస్తాయి. ఇద్దరికి అనుకూల.. ప్రతికూల సమయాలు ఒకే సందర్భంలో ఉండటం కొత్తేం కాదు. గతంలోనూ ఇద్దరికి ఒకే సమయంలో ఒకేలాంటి పరిస్థితులు ఎదురుకావటం గమనార్హం. తీవ్రత విషయంలో కుడి ఎడంగా ఉన్నా.. మొత్తంగా అయితే మాత్రం పరిస్థితులు దాదాపు ఒకేలా ఉండటం కనిపిస్తుంది.

తాజా పరిణామాల్ని చూస్తే.. ఇద్దరు చంద్రుళ్లను ఉద్యమ నేతలు ఇరుకున పెట్టటమేకాదు.. వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి వస్తే.. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం చేస్తున్న విమర్శలు కేసీఆర్ సర్కారుకు ఇబ్బందికరంగా మారటమే కాదు.. పని తీరు మీద వేలెత్తి చూపించేలా ఉన్న పరిస్థితి. ఇదే సమయంలో ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొని ఉండటం విశేషంగా చెప్పాలి. తెలంగాణలో కోదండరాం కేసీఆర్ సర్కారుకు చిరాకు పుట్టిస్తుంటే.. ఏపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష వణుకు పుట్టించే పరిస్థితి.

ఇంచుమించు ఒకే సమయంలో స్టార్ట్ అయిన ఈ పరిస్థితిలో బాబుతో పోలిస్తే.. కేసీఆర్ పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తున్నా.. దీర్ఘకాలంలో చూస్తే కేసీఆర్ కు సైతం ఇబ్బంది కలిగించే పరిణామంగా చెప్పాలి. పేర్లే కాదు.. వారికి ఎదురవుతున్న అనుభవాలు కూడా ఒకేలా ఉండటం యాదృశ్చికమే అయినా విశేషంగానే చెప్పక తప్పదు.​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English