రెండు కమిటీల బాటలో బీజేపీ

రెండు కమిటీల బాటలో బీజేపీ

నిన్న మొన్నటి వరకు ప్రత్యేక తెలంగాణ మీద స్పీడును ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు ఆత్మవలోకనంలో పడింది. కాంగ్రెస్ నిర్ణయంతో తెలంగాణ ఏర్పాటు ఖరారైన నేపథ్యంలో.. సీమాంధ్రలో ఉద్యమం ఊపందుకోవటం.. ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి రావటంతో పాటు.. విభజన రాగం అందుకున్న బీజేపీపై ఆ ప్రాంతంలో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. ఇప్పుడా పార్టీ.. మిగిలిన పార్టీల బాట పట్టునుంది.

ఇదే అంశం.. బీజేపీ పదాదికారుల సమావేశంలోనే భారీ చర్చకు దారి తీసింది. తమ ప్రాంతంలో ఉద్యమం చాలా తీవ్రంగా ఉందని.. తాము బయటకు వెళ్లలేకపోతున్నామని.. బీజేపీ రెండు ప్రాంతాలకు వేర్వేరు కమిటీలు వేయాలని.. లేని పక్షంలో సీమాంధ్రలో పార్టీ మనగలగటం కష్టమని కమలనాథులు తేల్చి చెబుతున్నారు. అధినాయకత్వంతో మాట్లాడి.. దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇవ్వటంతో.. తుది నిర్ణయం కోసం సీమాంధ్ర కమలనాధులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు