ఇదేం పిచ్చి?శాంతి కోసం 6వేల మంది నగ్నప్రదర్శన

ఇదేం పిచ్చి?శాంతి కోసం 6వేల మంది నగ్నప్రదర్శన

కొంగొత్త పోకడలకు పెద్దపీట వేస్తున్న ఉత్సాహానికి ఇదో ఉదాహరణ. ప్రపంచశాంతి కోసం అంటూ నగ్నంగా ఫొటోకు ఫోజులు ఇవ్వడమే వింత అనుకుంటే పదులు కాదు వందలు కాదు వేలమంది అలా ఫోజు ఇవ్వడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన అమెరికన్ ఆర్ట్ ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యూనిక్ ఖాతాలో ఈ రికార్డు పడింది.

స్పెన్సర్ ట్యూనిక్ సాధారణంగా జనాలనే ఫోటోలు తీస్తారు. అది కూడా ఒక పెద్ద సమూహంగా ఉన్న జనాలను మాత్రమే తీయడం ఈయన గారి ప్రత్యేకత. అయితే ఇందులో ఏముంది స్పెషాలిటీ అనేగా మీడౌటు…అలా చేస్తే ట్యూనిక్ పేరు ఎందుకు మారుమోగుతుంది. ఏదో వెరైటీ ఉండాలిగా…అందుకే నగ్నంగా గుంపులో ఉన్న వారినే ట్యూనిక్ ఫోటోలు తీస్తాడు! అయితే ఈ సారి మాత్రం ఆయన చిన్న గుంపును టార్గెట్ చేయలేదు ..ఏకంగా 6వేల మందిని నగ్నంగా ఫోటో తీశాడు.

బాబోయ్...ఇదేంటి అని అడిగితే శాంతి నెలకొల్పేందుకేనని చెప్పాడు. కొలంబియాలో ఈ తంతు చోటు చేసుకుంది. కొలంబియాలోని ప్రఖ్యాత బొగాటోస్ మెయిన్ పబ్లిక్ స్క్వేర్ లో 6వేల మంది నగ్నంగా ఫోజు ఇచ్చారు. ఈ రికార్డు గురించి స్పెన్సర్ స్పందిస్తూ 6వేల మందిని ఒప్పించేందుకు నానా తంటాలు పడ్డానని చెప్పుకొచ్చాడు. ఏంటో వెర్రి వెయ్యివిధాలు. ఏమంటారు?!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు