రేవంత్ ఫుల్ రీఛార్జ్ అయ్యారా?

రేవంత్ ఫుల్ రీఛార్జ్ అయ్యారా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. అవకాశాలు రేఖా మాత్రం కనిపించినా.. వాటిని అందిపుచ్చుకొని కష్టపడితే అదే అదృష్టంగా మారటమే కాదు..రాజకీయంగా కీలకశక్తిగా అవతరించే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేసి సక్సెస్ అయిన రేవంత్ ఇప్పుడు మాంచి జోష్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమానికి పురుటిగడ్డలాంటి ఉస్మానియా క్యాంపస్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జన జాతర కార్యక్రమానికి సినిమాటిక్ గా హాజరై.. తాను చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పేసి క్యాంపస్ విద్యార్థుల్లో మాంచి ఊపు తెచ్చిన రేవంత్.. ఈ ఎపిసోడ్ పుణ్యమా అని ఫుల్ రీఛార్జ్ అయినట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన జనజాతర కార్యక్రమానికి విపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరైనా.. రేవంత్ మాటలకు వచ్చినంత రెస్పాన్స్ మరెవరిమాటలకు రాలేదని చెబుతున్నారు. ఈ సభకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. అధికారపక్షం చేసిన సూచనతో ఈ సభకు సంబంధించిన కవరేజ్ లో మీడియా మితంగా వ్యవహరించిందన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. పోలీసుల కళ్లు కప్పి.. వర్సిటీ విద్యార్థిగా బైక్ మీద.. కొద్దిదూరం కాలి నడకతో వేదిక వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డిని చూసినంతనే వర్సిటీ విద్యార్థులు కేరింతలు కొట్టినట్లుగా చెబుతున్నారు. రేవంత్ చేసిన ప్రసంగానికి వర్సిటీ విద్యార్థులు తమ చప్పట్లతో మరింతగా ఉత్సాహపరిచారని.. ఆయన మాటలకే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదన్న భావన ఈ సభ స్పష్టం చేసిందని చెబుతున్నారు. ఓటుకు నోటు కేసుతో రేవంత్ కు ఇబ్బందులు మొదలు కావటంతోపాటు.. ఆయన ఇమేజ్ కాస్త దెబ్బ తింది. కానీ.. ఉస్మానియాలో రేవంత్ క్రేజ్ చూసినోళ్లకు కేసీఆర్ కు ధీటుగా నిలబడేది చివరకు రేవంత్ అన్న మాట స్పష్టమైనట్లేనని చెబుతున్నారు. ఏది ఏమైనా జనజాతర సభ రేవంత్ ను ఫుల్ రీఛార్జ్ చేయటంతో పాటు.. కేసీఆర్ తో ఢీ కొట్టటానికి రేవంతే సరైన నేతగా పలువురు ఫీల్ అయిన పరిస్థితి. ఈ సభ తనకు టానిక్ లాంటిదేనని రేవంత్ సైతం తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించటం గమనించదగ్గ అంశంగా చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు