అమరావతికి ఉద్యోగులు వెళ్లే డేట్ మారుతుందా?

అమరావతికి ఉద్యోగులు వెళ్లే డేట్ మారుతుందా?

జూన్ 27. నవ్యాంధ్రప్రదేశ్లో ఈ తేదీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజు నుంచే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి పరిపాలన చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బలంగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల తరలింపు ప్రక్రియను ముఖ్యమంత్రి వేగిరం చేశారు. అయతేత ఈ ప్రక్రియకు అడ్డంకులు ఎదురయినట్లు కనిపిస్తోంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్తో ఏపీ సచివాలయ ఉద్యోగులు భేటీ అయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలి వెళ్లడం వల్ల ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలపై వారు చర్చించారు. జూన్లోగా అమరావతికి వెళ్లాలని ప్రభుత్వం చెబుతుందే తప్ప పూర్తి వివరాలు ఇవ్వలేదని తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజధానికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఉద్యోగులను పంపాలని కోరారు. అదే విధంగా భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాతే మిగతా ఉద్యోగులను తరలించాలని, అప్పటివరకు ప్రక్రియను వాయిదా వేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ఇవాళ అన్నారు. దీనిపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఉద్యోగుల అభిప్రాయాలు సావధానంగా విన్న ప్రధాన కార్యదర్శి టక్కర్ ఉద్యోగుల తరలింపుపై శుక్రవారం నుంచి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు