కేసీఆర్ కామెంట్‌పై బాబు ఏమ‌న్నారో చూశారా?

కేసీఆర్ కామెంట్‌పై బాబు ఏమ‌న్నారో చూశారా?

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం, ఆంధ్ర‌ప్ర‌దేవ్ న‌వ‌నిర్మాణం దీక్ష సంద‌ర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మీడియాతో త‌మ మ‌నోభావాలు పంచుకుంటున్నారు. మొద‌టి మీడియా ముందుకు వ‌చ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్ర‌మైన ఏపీ గురించి మాట్లాడుతూ త‌మకు గిల్లిక‌జ్జాలు ఇష్టం లేద‌ని చెప్పారు. అయితే త‌మతో పెట్టుకుంటే ఏపీయే న‌ష్ట‌పోతుంద‌ని అన్నారు. దీనిపై స్పందించిన చంద్ర‌బాబు తాజాగా కేసీఆర్ కామెంట్ల‌కు రియాక్ట‌య్యారు.

రెండు రాష్ట్రాల మధ్య విభేదాల వల్ల నష్టపోయేది ప్ర‌జ‌లే కాబ‌ట్టి సామసరస్య పూర్వకంగా కూర్చుని పరిష్కరించుకుందామ‌ని బాబు పిల‌పునిచ్చారు. ఈ విషయంలో కేంద్రం కూడా ఉదారంగా ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కోర్టులకు వెళ్లడం, గొడవలు పడటం ఎవరికీ మంచిది కాదని బాబు పున‌రుద్ఘాటించారు హైదరాబాద్‌ను ఎంతో ఆర్తితో అభివృద్ధి చేసి మంచి ఫలితాలు సాధించిన త‌నకు ఆ రాష్ట్రంపై ప్రత్యేక బాధ్యత ఉందని అన్నారు.

ఇక ఏపీ అవ‌స‌రాల గురించి, కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త గురించి చంద్ర‌బాబు త‌న భావాల‌ని పంచుకుంటూ త‌మ రాష్ట్ర సమస్యను ప్రత్యేకంగా చూడాలని  చెబుతున్నాన‌ని బాబు వివ‌రించారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ దారుణంగా వ్యవహరించినందుకే ప్రజలు శిక్షించారని త‌ద్వారా 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీ అడ్రస్‌ లేకుండా పోయిందని తెలిపారు. ప్రజల మనోభావాలు దెబ్బతిన‌కుండా చూడ‌టంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, ఎన్‌డీఏపై నమ్మకం ఉన్నందున దాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాకు చెప్పాన‌ని బాబు వివ‌రించారు.

అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు చేయూత ఇవ్వాలా లేదా ఆలోచించండి అంటూ వాస్త‌వ ప‌రిస్థితుల‌ను తెలియ‌జెప్పిన‌ట్లు బాబు అన్నారు. ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ, విభజన చట్టంలో పెట్టినవి అన్నీ ఇవ్వాల‌ని కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు