గమనించారా?​: సరిగ్గా ఏడాదికి మళ్లీ అదే కొనుగోళ్లు

గమనించారా?​: సరిగ్గా ఏడాదికి మళ్లీ అదే కొనుగోళ్లు

సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం చోటు చేసుకుంది. గత ఏడాది ఇదే సమయానికి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ అధికారపక్షానికి భారీ షాక్ ఇచ్చేందుకు ప్రయత్నం జరగటం.. అందులో భాగంగా తెలంగాణ నామినేట్ సభ్యుడు స్టీఫెన్ సన్ ను తాము చెప్పిన అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి బేరం కుదుర్చుకోవటం.. ముందుగా అనుకున్న దాని ప్రకారం స్టీఫెన్ సన్ కు రూ.50లక్షల మొత్తాన్ని పెద్ద సంచిలో సర్ది ఇచ్చిన విషయం కెమేరాల్లో రికార్డు అయి.. అనంతరం టీవీల్లో అందరూ చూసే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే.

ఆ చేదు అనుభవాన్ని ఇంకా మర్చిపోక ముందే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రజాప్రతినిధుల కొనుగోళ్ల అంశం మరోసారి తెర మీదకు రావటం గమనార్హం. తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో తమకున్న సంఖ్యా బలానికి మించి ఒక అభ్యర్థిని బరిలోకి దింపి.. విపక్ష నేతను దెబ్బ తీయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది మాదిరి.. తాము అనుకున్నది పూర్తి చేసే క్రమంలో బాబు అండ్ కో సక్సెస్ అవుతారా? లేదా? చేదు అనుభవం ఎదురవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏడాది క్రితం ఏ విషయంలో అయితే టీడీపీ ఎదురుదెబ్బలు తిందో.. ఇప్పుడు అలాంటి ఉదంతంలో.. సరిగ్గా అదే సమయంలో జరుగుతున్న తాజా పరిణామాలు ఏపీ అధికారపక్షానికి ఏ విధంగా మారతాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు