ఎన్టీఆర్ ప్రత్యేక హోదా కోసం పోరాడతాడా..?

ఎన్టీఆర్ ప్రత్యేక హోదా కోసం పోరాడతాడా..?


ప్రత్యేక హోదాపై హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంటికి ఒకరు వచ్చి ప్రత్యేక హోదాపై పోరాడకపోతే అన్నగారి ఆత్మ శాంతించదంటూ హరికృష్ణ చేసిన కమెంట్స్ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.

దానికితోడు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా టీడిపి ఏర్పాటు చేసిన మహానాడుకు కూడా హరికృష్ణ వెళ్లలేదు. ఆయన కుమారుడిగా.. ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో సుధీర్ఘంగా ఆయనతో పాటు నడిచిన వ్యక్తిగా మహానాడుకు వెళ్లడం హరికృష్ణ బాధ్యత. కానీ ఆయన తన తండ్రికి నివాళులు అర్పించడమే గొప్ప పని అని.. దాని తర్వాతే మహానాడైనా ఇంకేదైనా అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అసలే ఇప్పుడు టీడీపి, హరికృష్ణ కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో రచ్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆల్ మోస్ట్ తెలుగుదేశం నుంచి సపరేట్ అయిపోయాడు. దానికి తోడు ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్, తండ్రి హరికృష్ణ అదే దారిలో నడుస్తున్నారు. ఇలాంటి టైమ్ లో హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎన్టీఆర్ కే రివర్స్ తగిలే ప్రమాదం లేకపోలేదు. ప్రత్యేక హోదా కోసం ఇంటికొకరు కచ్చితంగా వచ్చి పోరాడాలి అని హరికృష్ణ అన్నారు.. మరి తండ్రి మాట ప్రకారం హరికృష్ణ ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ వస్తాడా.. ప్రత్యేక హోదా కోసం వచ్చి పోరాడతాడా..? కసీనం ఓ స్టేట్ మెంట్ అన్నా ఇస్తాడా అనే చర్చ జరుగుతోంది. అసలే ఇప్పుడు సినిమాల బిజీలో ఉండి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు జూనియర్. ఇలాంటి టైమ్ లో అతడి తండ్రి చేస్తోన్న వ్యాఖ్యలు రివర్స్ లో ఆయనకే తగులుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు