32 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన అమ్మ

32 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన అమ్మ

తమిళ ఓటర్లను ఇండియాలోనే ది బెస్ట్ అంటారు. అందుక్కారణం.. ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పిడి చేయించడమే. ఎంత బాగా పాలించినా.. అక్కడ ఐదేళ్లు తిరిగేసరికి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చేస్తుంటుంది. ఇలా ఐదేళ్లకోసారి అధికారం మారడం వల్ల పార్టీలకు భయం ఉంటోందని.. పాలన బాగా సాగుతుందని.. అభివృద్ధి జరుగుతుందని అంటారు. తమిళనాడు నిజంగానే మిగతా దక్షిణాది రాష్ట్రాల కంటే మెరుగైన స్థితిలో ఉందన్నది వాస్తవం.

ఐతే గత మూడు దశాబ్దాలుగా ఈ సంప్రదాయాన్నే పాటిస్తూ వస్తున్న తమిళ ఓటరు ఈసారి మాత్రం రూటు మార్చేశాడు. అన్నాడీఎంకేకు వరుసగా రెండోసారి అధికారం కట్టెబ్టేశాడు. అమ్మ ఐదేళ్లుగా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చాయో.. లేక ఎన్నికల్లో ఆమె ఇచ్చిన అలవిమాలిన హామీలు నచ్చాయో గానీ.. జయలలితకు చరిత్రను తిరగరాసే అవకాశమైతే ఇచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు