సోము మీద తెలుగు తమ్ముడి కామెంట్ అదిరిందా?

సోము మీద తెలుగు తమ్ముడి కామెంట్ అదిరిందా?

దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినా.. ఏపీలోని చంద్రబాబు సర్కారు మాదిరి రాజధాని కోసం అంతలా మాట్లాడుతున్న వైనం ఎక్కడా లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై ఏపీ తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ రాజధానిలో నిర్మించే సచివాలయాన్ని అనకాపల్లిలోని మున్సిపల్ ఆఫీసుతో పోలుస్తూ వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై పలువురు తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉండగా.. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తాజాగా సోము మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనకాపల్లికి.. అమరావతికి తేడా తెలియని వ్యక్తి సోము వీర్రాజు అంటూ ఫైర్ అయిన రాజేంద్రప్రసాద్.. రాజధానికి సంబంధించి ఏపీ సర్కారు అడుగుతున్నవన్నీ విభజన చట్టంలోని అంశాలే తప్ప ప్రత్యేకమైనవి ఏమీ లేవని స్పష్టం చేశారు. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల్ని మోడీ సర్కారు నెరవేరిస్తే చాలని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షం అయి ఉండి టీడీపీ సర్కారు మీద సోము వీర్రాజు మాటలు హద్దులు దాటినట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు.