కేటీఆర్ డైనమిక్ అని ఎప్పుడు తెలిసింది హరీశ్?

కేటీఆర్ డైనమిక్ అని ఎప్పుడు తెలిసింది హరీశ్?

పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లటంలోనే రాజకీయ నాయకుడి ‘రాజకీయ’ చాతుర్యం కనిపిస్తుంది. కలిసిరాని కాలంలో కామ్ గా ఉండే నేతలు.. తమదైన రోజులు వచ్చినప్పుడు ఎంతలా చెలరేగిపోతారో.. తమ విశ్వరూపాన్ని ఎంతలా ప్రదర్శిస్తారన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

 మేనమామ కమ్ టీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. పుష్కరానికి పైగా సాగిన తెలంగాణ ఉద్యమంలో వెన్నెంటే ఉంటూ ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసిన హరీశ్ కు ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్న విషయం ఒకరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ తర్వాత పార్టీలో హరీశే నెంబర్ టూ అని అందరూ అనుకునే పరిస్థితి. ఆ సమయంలో అమెరికా నుంచి ల్యాండ్ అయిన కేటీఆర్ కారణంగా పరిస్థితి ఎంతలా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కేటీఆర్ రాకతో తమ నాయకుడి స్థానానికి ఎలాంటి ముప్పు రాదని హరీశ్ వర్గం అనుకున్న.. నెమ్మదిగా తన సత్తా ఏమిటో చూపిన కేటీఆర్ తో లెక్కలు మారిపోయిన పరిస్థితి.

తెలంగాణ రాష్ర ఏర్పాటు అనంతరం పార్టీలో నెంబర్ టూ ఎవరన్న విషయం మీద తరచూ చర్చ జరగటం.. ఈ విషయంలో కేటీఆర్.. హరీశ్ వర్గం మధ్య కాస్త పోటాపోటీ ఉండటం కనిపించింది. అయితే.. అలాంటి వాటికి చెక్ చెబుతూ పార్టీ అధినేతకేసీఆర్ తన చేష్టలతో పార్టీలో నెంబర్ టూ ఎవరన్న విషయాన్ని తేల్చేసిన సంగతి తెలిసిందే. తనది కాని టైంలో తాను ఎక్కువ ఆశించటం సరికాదనుకున్నారేమో కానీ.. ఎప్పుడూ లేని విధంగా కేటీఆర్ ను ఉద్దేశించి హరీశ్ మాట్లాడుతూ.. డైనమిక్ మంత్రిగా అభివర్ణించటం విశేషం. హరీశ్ నోటి వెంట వచ్చిన డైనమిక్ మాటకు పార్టీలోనే కాదు తెలంగాణరాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మంచి వ్యూహకర్తగా పేరున్న హరీశ్ నోటి వెంట బావమరిది వరసైన కేటీఆర్ ను పొగిడేయటం చూస్తే.. హరీశ్ ఇంతలా మారిపోవటం వెనుక కారణం ఏమై ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. బావమరిది నెంబర్ టూ అన్న విషయంలో తనకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని డైనమిక్ పొగడ్తతో స్పష్టంగా చేస్తున్నట్లు కనిపించట్లేదు..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు