తప్పుకున్నా.. తప్పుచేయలేదంట

తప్పుకున్నా.. తప్పుచేయలేదంట

నమ్మగలమా? అశ్వినీకుమార్‌ మాటల్ని. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన అశ్వినికుమార్‌ పదవికి రాజీనామా చేశారు. అది ఆమోదం పొందింది కూడాను. రాజీనామా చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్ళు పనిచేశాయి తప్ప, ఆయనగారేమీ తప్పు చేయలేదంట. తప్పు చేసివాడెవడైనా తప్పు చేసినట్టుగా ఒప్పుకుంటాడా? ఒప్పుకునే ప్రసక్తే లేదు.

సిబిఐ దర్యాప్తులో వేలెట్టినందుకు అశ్వినికుమార్‌ పదవి ఊడింది. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టాక కేంద్ర ప్రభుత్వం అశ్వినికుమార్‌ని తప్పించింది. తప్పించక తప్పని పరిస్థితి ఏర్పడని పక్షంలో అశ్వనికుమార్‌గారికి పదవీ గండం ఉండేది కాదు. బొగ్గు కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సిబిఐకి అడ్డు తగిలారు అశ్వినికుమార్‌. సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించింది. ఇప్పుడింక అశ్వినికుమార్‌ ఏం చెప్పినా జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఇకనైనా మౌనం దాల్చకపోయినట్లయితే రాజకీయంగా ఇంకా ఇబ్బందులు పడవలసి వస్తుంది అశ్వినికుమార్‌గారికి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు