ఔటర్ లో విజయసాయిరెడ్డికి యాక్సిడెంట్

ఔటర్ లో విజయసాయిరెడ్డికి యాక్సిడెంట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డికి యాక్సిడెంట్ అయ్యింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే..ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంగళవారం ఉదయం విజయ సాయిరెడ్డి.. పార్టీ నేతలు దుర్గా ప్రసాద్ రాజు.. దశరథ్ రెడ్డిలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగు రోడ్డు మీద అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో విజయసాయిరెడ్డి.. దుర్గా ప్రసాద్ రాజు.. దశరథ్ రెడ్డి.. డ్రైవర్ కు గాయాలయ్యాయి. అయితే.. విజయసాయిరెడ్డికి స్వల్ప గాయాలు కాగా.. దుర్గా ప్రసాద్ రెడ్డికి మాత్రం గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎవరూ లేరని.. అందరూ క్షేమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధమ చికిత్స చేసి.. వారిని అపోలోకు తరలించారు. అయితే.. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై వివరాలు బయటకు రావాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు