కాంగ్రెసు గూటికేనా?

కాంగ్రెసు గూటికేనా?

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెసు పార్టీకి కర్నాటక ఎన్నికల్లో గెలుపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కర్నాటకలో కాంగ్రెసు పార్టీ అధికారం చేజిక్కించుకోవడం కర్నాటక ప్రజలకు మంచిదన్నారాయన. యడ్యూరప్ప మొదటి నుంచీ కాంగ్రెసు వ్యతిరేకి. కరడుగట్టిన బిజెపి వాదిగా, కాంగ్రెసు వ్యతిరేకిగా రాజకీయ జీవితమంతా కాంగ్రెసుతో పోరాటం చేశారు. ఆయన నోటివెంట కర్నాటక ప్రజలకు కాంగ్రెసు పాలనతో మంచి జరుగుతుందనే మాటలు రావడం కాకతాళీయం కాదు.

కర్నాటకలో విచిత్రమైన రాజకీయాలు నడుస్తుంటాయి. పూర్తి మెజారిటీ రాదేమోనని ఎన్నికల ఫలితాలకు ముందు అనుమానాలు రావడంతో కాంగ్రెసు పార్టీ యడ్యూరప్పనే సంప్రదించింది. ఆయన నడుపుతున్న కెజెపి పార్టీని మిత్రపక్షంగా కలుపుకోవడానికీ కాంగ్రెసు సిద్ధమయ్యింది కూడాను. యడ్యూరప్ప ఇప్పుడు కాంగ్రెసుని పొగడటమంటే కాంగ్రెసు గూటికి ఆయన చేరవచ్చుననిపిస్తున్నది. లేదా కాంగ్రెసుకి మిత్రపక్షంగా కెజెపి వుండవచ్చును.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English