అఫిషియల్ః వైసీపీ ప్యాకప్కు గుర్తింపు

అఫిషియల్ః వైసీపీ ప్యాకప్కు గుర్తింపు

తెలంగాణలో టీఆర్ఎస్ విజయపరంపరకు మరో నిదర్శనం. టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలీనమైంది. టీఆర్ఎస్ఎల్పీలో వైసీపీని విలీనం చేస్తూ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన బులెటిన్ను శాసనసభ అధికారులు తాజాగా విడుదల చేశారు.

టీఆర్ఎస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు తమను పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని స్పీకర్ కు విన్నవించారు. వైసీపీ ఎమ్మెల్యేల వినతిని స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు వైసీపీ నేతలంతా టీఆర్ఎస్లో చేరిన విషయం విదితమే. దీంతో తెలంగాణలో వైసీపీ ఖాళీ అయింది. ఈ విలీనంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 81కి చేరింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు