సాక్షిపై చండ్ర నిప్పులు

సాక్షిపై చండ్ర నిప్పులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది. `ప్ర‌త్యేక హోదా` త‌ప్ప అంటూ మాట దాట‌వేసింది. ఇక ఆ ప‌దం విభ‌జ‌న చ‌ట్టంలో లేద‌ని.. తేల్చి చెప్పేసింది. ఇప్పుడు రాజ‌కీయాల‌కు స‌మ‌యం కాదు! రాష్ట్రానికి న్యాయం చేస్తుంద‌ని.. న‌మ్మి టీడీపీ.. బీజేపీతో జ‌త‌కట్టింది. ఇప్పుడు ప్ర‌త్యేక హోదా గురించి కేంద్రం మాట మార్చితే.. ఇది టీడీపీ వైఫ‌ల్యం అని.. చంద్ర‌బాబు ఏపీకి వెన్నుపోటు పొడిచాడని..అంటే ఎవ‌రైనా న‌మ్మ‌గ‌ల‌రా?  కానీ దీనిని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తోంది సాక్షి ప‌త్రిక‌. ఏ చిన్న అవ‌కాశం దొరికినా..  టీడీపీ ప్ర‌భుత్వంపైనా, చంద్ర‌బాబుపైనా విషం చిమ్మేందుకు ముందుంటుంది సాక్షి. రాష్ట్రానికి అన్యాయం జ‌రిగిన విష‌యాన్ని కూడా ఇందుకు అస్త్రంగా వాడుకుంటోంది. దీనిపై సీఎం చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో జరిగిన పర్యటనలో చేసిన ప్రసంగం, టీడీపీ కార్యకర్తలను ప్రత్యేక హోదా విషయంలో అడిగిన తీరు ఆసక్తికరంగా ఉంది. 'నేను ఆంద్రప్రదేశ్ కు వెన్నుపోటు పొడిచాన‌ట‌, ఇదేమైనా బాగుందా తమ్ముళ్లు "అని ప్రశ్నించారని కథ‌నం వచ్చింది. సాక్షి పత్రికలో వచ్చిన కథ‌నంపై ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ ఈ వ్యాఖ్య చేశారని ఆ పత్రిక తెలిపింది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏమీ చెప్పడం లేదని, ఏమి ఇస్తుందో, చేస్తుందో స్పష్టత ఇస్తే ప్రణాళిక రూపొందించుకోవచ్చని చంద్రబాబు అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో రాజీపడ్డానన్న ఆరోపణలు నిజం కాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తానని, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లి, వెంకయ్య నాయుడులతో మాట్లాడి ఆలోచించాలని కోరానని చంద్రబాబు చెప్పారు.అవసమైతే మళ్లీ ,మళ్లీ డిల్లీ వెళ్లి ప్రదానిని కలుస్తానని ఆయన అన్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు