తెలంగాణ టీడీపీకి య‌న‌మ‌ల చికిత్స

తెలంగాణ టీడీపీకి య‌న‌మ‌ల చికిత్స

తెలంగాణ టీడీపీ పూర్తి నిస్స‌హాయ‌త‌తో ఉంది. ఇక్క‌డ టీడీపీని స్మాష్ చేసే విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నూటికి నూరుశాతం స‌క్సెస్ అయ్యారు. తెలంగాణ టీడీపీని కేసీఆర్ త‌న ప్లాన్లుతో క‌కావిక‌లం చేసి పాడేశారు. ఇక్క‌డ నుంచి గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మందిని ఆయ‌న త‌న గులాబీ గూట్లో చేర్చేసుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీలో ర‌మ‌ణ‌, మోత్కుప‌ల్లి, రావుల లాంటి చాలా త‌క్కువ మంది సీనియ‌ర్లు మాత్ర‌మే మిగిలారు.

 అయితే తెలుగుదేశం క‌నీసం వ‌చ్చే ఎన్నికల నాటికి అయినా ఇక్క‌డ త‌మ స‌త్తా చాటేందుకు తెలంగాణ శాఖ‌కు ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేసే విష‌యంపై ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఓ ప్ర‌తిపాద‌న‌ను చంద్ర‌బాబు ముందు ఉంచిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన పార్టీ పాలిట్ బ్యూరో స‌మావేశంలో య‌న‌మ‌ల తెలంగాణ‌లో తెలుగుదేశం బలోపేతానికి ప‌లు సూచ‌న‌లు చేశార‌ట‌.

 తెలంగాణ నేత‌ల్లో బాగా న‌మ్మ‌క‌స్తుడైన వ్య‌క్తికి ఏపీ నుంచి రాజ్య‌స‌భ అవ‌కాశం ఇవ్వాల‌ని, ఇక తెలంగాణ మ‌హిళా నేత శోభారాణికి టీటీడీ స‌భ్య‌త్వం ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో తెలంగాణ టీడీపీ వ్య‌వ‌హారాల‌ను పార్టీ కేంద్ర‌మంత్రి సుజ‌నాచౌద‌రి చూసేవారు. త‌ర్వాత లోకేష్ తెలంగాణ వ్య‌వ‌హారాలు ప‌ర్య‌వేక్షించారు. ఇప్పుడు చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రూ ఏపీకే ప‌రిమిత‌మ‌వ్వ‌డంతో తెలంగాణ టీడీపీ క‌ష్ట‌న‌ష్టాల గురించి ప‌ట్టించుకునే పెద్ద త‌ల‌కాయే లేకుండా పోయింది.

 అయితే య‌న‌మ‌ల చేసిన తాజా ప్ర‌తిపాద‌న ప్ర‌కారం క‌నీసం ఇప్ప‌టి నుంచి అయినా తెలంగాణ‌లో టీడీపీ బ‌లోపేతానికి చంద్ర‌బాబు దృష్టి సారిస్తే కొంత‌వ‌ర‌కైనా పుంజుకునే ఛాన్స్ ఉంటుంద‌న్న అభిప్రాయం టీడీపీలో వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి య‌న‌మ‌ల ప్లాన్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో...ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో కాల‌మే నిర్ణ‌యించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English