లేడీ ఐఏఎస్ , మాజీ హీరోయిన్ మధ్య భర్త కోసం పోరు

లేడీ ఐఏఎస్ , మాజీ హీరోయిన్ మధ్య భర్త కోసం పోరు

లేడీ ఐఏఎస్ ఆఫీసర్... మాజీ హీరోయిన్ మధ్య భర్త విషయంలో వివాదం తలెత్తింది. తన భర్త తనను మోసం చేసి ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నాడంటూ ఆ నటి ఆరోపిస్తోంది. ఈ వివాదంలో ఇద్దరు మహిళల ముద్దుల మగాడు విజయ్ గోపాల్ అనే సినీ జర్నలిస్టు. ఆయన మొదట భార్య, మాజీ హీరోయిన్, బుల్లితెర నటి పూజితను విడిచి ప్రస్తుతం ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని పెళ్లి చేసుకోవడంలో వివాదం తలెత్తింది.

విజయ్ గోపాల్ తనను మోసం చేశాడని... తనను, కుమారుడిని అన్యాయం చేస్తూ రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడని పూజిత ఆరోపిస్తోంది. కాగా రేఖారాణి ఇంతకుముందు నెల్లూరు జాయింట్ కలెక్టరుగా పనిచేశారు. రెండేళ్ల కిందట నెల్లూరు జిల్లాలోని పుట్టమరాజు ఖండ్రిగ గ్రామాన్ని సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకునేలా చేసి ఆమె వార్తల్లో నిలిచారు. అంతకుమించి కూడా ఆమెకు మంచి నేపథ్యం ఉంది. ఆమె భర్త పరదేశి నాయుడు ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ 1987లో నక్సలైట్ల కాల్పుల్లో మరణించారు. ఆ తరువాత భర్తపోయిన దు:ఖాన్ని దిగమింగుకుంటూనే అంచలంచెలుగా ఎదిగి రేఖారాణి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం ఆమె పూజిత నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రేఖపై ఫిర్యాదు చేయడానికి వెళ్లినా పోలీసులు సహకరించడం లేదని.. తనను ఎన్ కౌంటర్ చేస్తానంటూ మరో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ బెదిరిస్తున్నారని పూజిత చెబుతోంది.

కాగా రేఖారాణి మాత్రం విజయ్ గోపాల్ ను పెళ్లి చేసుకున్నది నిజమేనని.. అయితే, అంతా చట్టప్రకారమే జరిగిందని చెబుతున్నారు. విజయ్ గోపాల్, పూజితలు పదేళ్ల కిందట విడిపోయారని.. లీగల్ గా అన్నీ చూసుకునే పెళ్లి చేసుకున్నానని ఆమె చెబుతున్నారు. ఏమైనా ఉంటే పూజిత కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు