ఖమ్మం ఎంపీ దెబ్బకు జగన్ ముఖం మాడిపోయింది

ఖమ్మం ఎంపీ దెబ్బకు జగన్ ముఖం మాడిపోయింది

ఏ రాజకీయ పార్టీలోనైనా.. ఏ నేతయినా ఆ పార్టీని వీడితే సాధారణంగా అధినేతకు రాజీనామా లేఖ పంపిస్తారు.. ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా ప్రకటిస్తారు. కొందరు కామ్ గా పోతారు.. ఇంకొందరు తిట్టిపోతారు. తామెందుకు పార్టీని వీడుతున్నామో చెబుతారు కొందరు... అప్పటి వరకు ఉన్న పార్టీని ఎందుకు వీడుతున్నామో చెబుతారు ఇంకొందరు. అంతేకానీ... నేరుగా పార్టీ అధినేతలను కలిసి ‘‘బాయ్ సార్... ఆ పార్టీలోకి పోతున్నా’’ అని చెప్పేసి రారు.  కానీ, తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేని శ్రీనివాసరెడ్డి మాత్రం జగన్ కు మొఖం మీదే చెప్పేసి టీఆరెస్ లోకి పోతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొద్దికాలంగా ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. పాలేరు ఉప ఎన్నికకు అభ్యర్థుల ప్రకటనకు ముందే ఆయన టీఆరెస్ లో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే...సంప్రదింపుల్లో ఆలస్యం... ఒప్పందాల్లో అస్పష్టత వల్ల కాస్త ఆలస్యమైంది.  టీఆరెస్ లో తన చేరికకు సంబంధించి ఆయన ఈ రోజు ప్రకటిస్తారని తెలుస్తోంది.

కాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ లోవైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తాను పార్టీ వీడుతున్నట్లు జగన్ కు ముఖం మీదే చెప్పేశారట. పొంగులేని అలా చెప్పగానే జగన్ కు ఏం సమాధానమివ్వాలో తెలియక నిశ్చేష్టంగా చూస్తూ ఉండిపోయారని తెలుస్తోంది. జగన్ కు మొఖం మీదే విషయం చెప్పేసిన పొంగులేటి ఆ వెంటనే లోటస్ పాండ్ నుంచి బయటకొచ్చేశారు. అక్కడి నుంచి సొంతూరు ఖమ్మానికి బయలుదేరిపోయారు.  ఈ రోజు ఖమ్మంలో  తన ముఖ్య అనుచరులతో సమావేశం కానున్న ఆయన ఆ వెంటనే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించే అవకాశాలున్నాయి. పొంగులేటితో పాటు ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత పాయం వెంకటేశ్వర్లు కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు.  పొంగులేటితో పాటు పాయం వెంకటేశ్వర్లు కూడా టీఆరెస్ లో చేరుతున్నారు. వీరిద్దరి చేరికతో తెలంగాణలో వైసీపీ కథ పూర్తిగా ముగిసిపోయినట్లే. ఇంతకుముందే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీఆరెస్ లో చేరడం.. ఇప్పుడు వీరిద్దరు వెళ్తుండడంతో వైసీపీకి ఇక్కడ ఏమాత్రం బలం లేకుండాపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు