మోడీ డిగ్రీ సర్టిఫికేట్ల మీద రచ్చ ఎందుకంటే..?

మోడీ డిగ్రీ సర్టిఫికేట్ల మీద రచ్చ ఎందుకంటే..?

ప్రధాని మోడీ ఇబ్బందుల్లో చిక్కుకోనున్నారా? ఆయన పుట్టినరోజుకు సంబంధించిన సమాచారం వేర్వేరు చోట్ల.. వేర్వేరుగా నమోదైందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆయన పుట్టిన రోజు మీద భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మోడీకి రెండు బర్త్ డేలు ఉన్నాయని.. ఏది అసలైన బర్త్ డే అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని వెబ్ సైట్లో మోడీ జన్మదినం సెప్టెంబర్ 17, 1950గా ప్రకటించగా.. ఆయన చదువుకున్న కాలేజీలో మాత్రం ఆగస్టు 29, 1949గా నమోదై ఉండటం ఇప్పుడు వివాదంగా మారింది.

మోడీ పుట్టినరోజు విషయం మీద నెలకొన్న వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత ద్విగ్విజయ్ సింగ్ గళం విప్పారు. మోడీ బర్త్ డేను నిర్ధారణ చేసుకోవటానికి వీలుగా ఆయన హైస్కూల్.. ఇంటర్.. గ్రాడ్యుయేషన్  సర్టిఫికేట్లను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చదువు రాని ప్రధానమంత్రి అయినా తమకు ఫర్లేదుకానీ.. బర్త్ డే విషయంలో నిజాయితీ లేకపోవటం తాము సహించమంటూ దిగ్విజయ్ ట్విట్టర్ ద్వారా విరుచుకుపడటం గమనార్హం.

ఇంతకాలం లేనిది ఉన్నట్లుండి మోడీ పుట్టినరోజు మీద వివాదం తెర మీద రావటానికి కారణం లేకపోలేదు. ఓపక్క కాంగ్రెస్ అధినేత్రి ఆగస్టా కుంభకోణంలో అడ్డంగా బుక్ అయిన నేపథ్యంలో.. దానికి ప్రతిగా మోడీ బద్నాం చేయటానికే ఆయన పుట్టినరోజు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. దీనిపై మోడీ ఎలాంటి క్లారిటీ ఇస్తారో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు