జ‌గన్ నిరూపిస్తే మంత్రి గుడ్‌బై చెప్తాడ‌ట

జ‌గన్ నిరూపిస్తే మంత్రి గుడ్‌బై చెప్తాడ‌ట

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు మ‌రోమారు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. అవినీతిలో కూరుకుపోయిన‌ వైకాపా ఎంతో కాలం మనుగడ సాగించలేదని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాల్సిన అవసరం లేదని, శాసనసభలో తెదేపాకు సరిపడా మెజార్టీ కూడా ఉందని తెలిపారు. జగన్‌ ఒంటెద్దు పోకడలు నచ్చక అభివృద్ధిని ఆకాంక్షించే వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భవిష్యత్‌లో వైసీపీలో జగన్‌ ఒక్కరే ఉంటారన్నారు. రాజకీయాల‌కు, ప్రజాసేవకు జగన్‌ అనర్హుడని ధ్వజమెత్తారు.

రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములు ఇవ్వడం, తాత్కాలిక సచివాలయం పనులు చకచకా జరుగడం జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారని రావెల మండిప‌డ్డారు. నిద్రపట్టక మానసిక ఒత్తిడికి గురై మతిభ్రమించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేశా చేశారు. తాను, మైత్రీ ఇన్‌ఫ్రా సంస్థకు కలసి రాజధానిలో భూములు కొనుగోలు చేసినట్లు జగన్‌ రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్ర‌క‌టించారు. ఒక‌వేళ అలా నిరూపించలేకపోతే జగన్‌ కూడా ఆపని చేస్తారా...అందుకు సిద్ధ‌మా అని సవాలు విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. పార్టీ నేత‌లు అంబటి రాంబాబు, రోజా ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం స‌రికాద‌ని అన్నారు. రోజా, రాంబాబుకు తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు