రేవంత్‌ను కేసీఆర్ ప్రాణ‌హాని ఎందుకు త‌ల‌పెట్టారు?

రేవంత్‌ను కేసీఆర్ ప్రాణ‌హాని ఎందుకు త‌ల‌పెట్టారు?

సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా ఉండే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మ‌రో క‌ల‌క‌లం సృష్టించే వార్త‌ను తెర‌మీదకు తీసుకువ‌చ్చారు. ఎప్పుడైనా త‌న ప‌దునైన మాట‌ల‌తో టార్గెట్ చేసే రేవంత్ రెడ్డి ఇపుడు కొత్త‌గా త‌న గురించి, త‌నకున్న ప్రాణ‌భ‌యం గురించి ప్ర‌క‌టించి ఆస‌క్తినే కాదు విస్మ‌యాన్ని క‌లిగించారు.

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో పాటు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. త‌న‌కున్న భ‌ద్ర‌త‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఉప‌సంహ‌రించారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నేతలమంటూ తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులపైనా నమ్మకం లేదని, అందుకే కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని కూడా మహబూబ్‌నగర్ ఎస్పీని ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.

డేర్ ఆండ్ డ్యాషింగ్ మ్యాన్ గా పేరున్న రేవంత్ ఈ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా తెర‌మీద‌కు రాని రేవంత్ రెడ్డి హ‌ఠాత్తుగా ప్రాణ‌భ‌యంతో  హైకోర్టును ఆశ్ర‌యించ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప్ర‌భుత్వం దాఖ‌లు చేసే కౌంట‌ర్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు