ఎలా? ఎలా? బాబూ ఎలా?

ఎలా? ఎలా? బాబూ ఎలా?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తప్ప ఇంకో పవర్‌ సెంటర్‌ ఉండదు. ఏ నిర్ణయమైనా చంద్రబాబే తీసుకోవాలి. ఆ పార్టీకి అన్నీ చంద్రబాబే. చంద్రబాబు పాదయాత్ర చేస్తే తెలుగు తమ్ముళ్ళు ఏర్పాట్లు చేయడం తప్ప, సమాంతరంగా పార్టీకి మేలు కలిగే కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. అదే టిడిపికి బలం, బలహీనత కూడాను.

చంద్రబాబు ఏం చేసినా పార్టీకి కొత్త వెలుగు కనిపించడంలేదు సరికదా, ఒక్కో లైటూ ఆరిపోతున్నది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి, కోటగిరి విద్యాధరరావు, నాగం జనార్ధన్‌రెడ్డి.. వీరంతా తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతలు ఒకప్పుడు. లిస్టులో ఇంకా చాలామంది ఉన్నారు. వీరెవరు ఇప్పుడు చంద్రబాబుతో లేరు. పోయినోళ్ళంతా చెడ్డోళ్ళేనని చంద్రబాబు ముద్ర వేస్తుండగా, చెడ్డవారు ఎక్కువైపోతున్నారు తెలుగుదేశం దృష్టిలో. వచ్చినోళ్ళనైనా మంచోళ్ళందామంటే ఆ మంచోళ్ళెవరూ రావడంలేదాయె.

చూడబోతే ఎన్నికలు ఏడాదిలో ముంచుకొస్తాయి. ఎలా? 2014లో పార్టీని విజయపథాన నడిపేది ఎలా? బాబూ ఎలా? అని తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్నవారు అంతర్మధనంతో కుమిలిపోతున్నార్ట. వారికేది బాబూగారూ బరోసా! 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English