ఫేస్‌బుక్‌లో పార్టీ మార్చేసిన వైకాపా ఎమ్మెల్యే

ఫేస్‌బుక్‌లో పార్టీ మార్చేసిన వైకాపా ఎమ్మెల్యే

ఈ హెడ్డింగ్ చూస్తే కాస్త షాకింగ్‌గానే ఉండొచ్చు...వైకాపా ఎమ్మెల్యే ఫేస్‌బుక్‌లో పార్టీ మార‌డం ఏంట‌బ్బా అన్న అనుమానం క‌ల‌గ‌క మాన‌దు. క‌ర్నూలు జిల్లా శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వైకాపా నుంచి ఆక‌ర్ష్‌లో భాగంగా ఈ రోజు టీడీపీలోకి వ‌చ్చేస్తున్నారు. పార్టీ మారే విష‌యంపై ఆయ‌న గ‌త వారం రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలోని వివిధ మండ‌లాల కార్య‌క‌ర్త‌లు, త‌న అనుచ‌రుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూనే ఉన్నారు. చివ‌ర‌కు త‌న‌తో పాటు వారి అభిప్రాయం కూడా తెలుసుకున్న ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి, భ‌విష్య‌త్తు కోసం పార్టీ మారాల‌ని డిసైడ్ అయ్యారు.

 ప్ర‌స్తుతం ఆయ‌న శ్రీశైలం ఎమ్మెల్యేగాను, క‌ర్నూలు జిల్లా వైకాపా అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. బుడ్డా నిత్యం సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ర్య‌ట‌న‌ల‌తో పాటు అభివృద్ధి ప‌నులు ఇత‌ర‌త్రా అంశాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తుంటారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆయ‌న ఫేస్‌బుక్ ప్రొఫైల్ మార్చేశారు. ఫేస్‌బుక్‌లో హోం పేజ్ వెన‌క ఉన్న ఫొటోలో వైకాపా నేత‌గా నిన్న‌టి వ‌ర‌కు ఉన్న ఆయ‌న రాత్రికి రాత్రే ఇంకా టీడీపీలో చేర‌కుండానే ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేగా ప‌రిచ‌యం చేసుకున్నారు. ఫేస్‌బుక్ హోం పేజ్‌లో వైకాపా రంగును తీసేసి దానిని ప‌సుపు రంగుతో మార్చేశారు.

   గురువారం సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో విజ‌య‌వాడ‌లో టీడీపీలో చేరుతున్న ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి 35 బస్సుల నిండా తన కార్యకర్తలతో బుధ‌వారం రాత్రి భారీగా విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరారు. బుడ్డా ఇంకా టీడీపీలోకి రాకుండానే ఫేస్‌బుక్‌లో మాత్రం టీడీపీలోకి వ‌చ్చేశారు. త‌న‌ను తాను టీడీపీ ఎమ్మెల్యేగా ప‌రిచ‌యం చేసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు