కరోనాను తరిమేయడం సాధ్యమే… ఇదిగో సాక్ష్యం

కరోనా అసలు మనల్ని వదులుతుందా? లేదా? ఈ పీడ ఎపుడు పోతుంది? మనం దీన్నుంచి బయటపడాలంటే వ్యాక్సిన్ రావల్సిందేనా? ఇన్ని భయాలు, ఆందోళనల మధ్య ఆలోచనలతో సమతం అవుతూ బతుకుతున్న మనకు కేరళ రాష్ట్రం ఆశలు రేపుతోంది. కట్టుతప్పితే కరోనాతో సహజీవనం చేయక తప్పదు కానీ… కంట్రోల్ చేస్తే కచ్చితంగా తరిమేయవచ్చన్న దానికి ఉదాహరణగా నిలుస్తోంది కేరళ. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంటే… కేరళలో వరుసగా రెండో రోజు జీరో కేసులు నమోదమయ్యాయి. పైగా ఇపుడు అక్కడ కేవలం 34 కేసులు కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి.

ఇప్పటి వరకు కేరళలో కేవలం 499 మందికి మాత్రమే కరోనా సోకింది. ఈరోజు 61 మంది డిశ్చార్జిగా కాగా 34 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంతవరకు అక్కడ మరణించింది నలుగురే. వారిలో ఒకరు 4 నెలల చిన్నారి. దీని గురించి ముఖ్యమంత్రి విజయన్ మాట్లాడుతూ కరోనాకు ఈ భూమ్మీద సేఫ్ ప్లేస్ కేవలం కేరళ మాత్రమే అని గర్వంగా చెప్పారు. 33 వేల టెస్టులు ఇంతవరకు చేశామన్నారు. గ్రామం యూనిట్ గా పనిచేసి కేసులను కంట్రోల్ చేశామని, అతికొద్దిరోజుల్లో కేరళ కరోనా ఫ్రీ స్టేట్ గా మారిపోతుందన్నారు ముఖ్యమంత్రి విజయన్.

ఇన్వెస్టర్లకు స్వాగతం

మీ పెట్టుబడలకు కేరళకు మించిన మంచి ఆప్షన్ లేదు. వారం రోజుల్లో ఏ ఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేస్తాం. రండి కేరళలో పెట్టబడులు పెట్టండి. మల్టిపుల్ లాజిస్టిక్ హబ్ కు అత్యంత అనుకూలమైన రాష్ట్రం కేరళ మాత్రమే అని విజయన్ అన్నారు. జల, రైలు, రోడ్డు, వాయు రవాణా పరంగా అన్నిటికీ అనకూలంగా ఉండటమే కాకుండా అత్యుత్తమ మ్యాన్ పవర్ అందుబాటులో ఉందన్నారు. ప్రపంచంలో ఎలాంటి వాతావరణంలో అయినా, ఎలాంటి పని అయినా చేయగలిగిన వాడే కేరళైట్ అని, ఏ విధంగా చూసినా టూరిజానికే కాదు పెట్టుబడలకు కూడా కేరళ భూతల స్వరం అని ముఖ్యంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటికే చాలా ఎంక్వయిరీలు వచ్చాయన్నారు. పెట్టుబడుదారులకు సాదర స్వాగతం పలుకుతామని ముఖ్యమంత్రి చెప్పారు.