చెర్రీ గొడవ, చిరంజీవి క్లారిఫికేషను

చెర్రీ గొడవ, చిరంజీవి క్లారిఫికేషను

'చరణ్‌ చెప్పాడు కదా, దానిపై నేను మాట్లాడ్డానికేమీ లేదు' అన్నారు చిరంజీవి, తన కుమారుడు చరణ్‌ ఓ 'దాడి' వివాదంలో ఇరుక్కోవడంపై మీడియా ప్రశ్నిస్తే. కేంద్ర మంత్రిగా చిరంజీవి ఇంతకన్నా భిన్నంగా చెప్పలేరు.

బాలకృష్ణ తన ఇంట్లో కాల్పులు జరిపినా, కాంగ్రెసు పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడి పుత్ర రత్నం ఓ హత్య కేసులో ఇరుక్కున్నా అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. చరణ్‌ గొడవ కూడా అంతే కావొచ్చునేమో. ఇప్పటికైతే ఇది పెద్ద వివాదంగానే ఉంది.

మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు అందడంతో ఈ కేసులో పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. చరణ్‌ కొట్టాడా? కొట్టించాడా? అన్నదానిపై వాస్తవాలు బయటకు వస్తే ఆ తరువాత అదెందుకు జరిగింది, దెబ్బలు తిన్నవారు అంతకు ముందు ఏం చేశారనేదీ తెలుస్తుంది. 'నో కామెంట్‌' అనకుండా చిరంజీవి, 'చరణ్‌ చెప్పాడు కదా' అనేసి సరిపెట్టారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English