గూగుల్ చెప్పిన నిజం; గూగుల్ డేంజరే

గూగుల్ చెప్పిన నిజం; గూగుల్ డేంజరే

సిగిరెట్ ప్యాకెట్ల మీద చెప్పిన తీరులోనే గూగులమ్మ ఒక కఠిన వాస్తవాన్ని చిలకపలుకుల్లా చెప్పుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు వినియోగించే గూగుల్ సెర్చ్ ఇంజిన్ వినియోగం డేంజరే అన్న విషయాన్ని ఒప్పేసుకుంది. ఏదైనా అంశానికి సంబంధించి వెతికే సమయంలో వచ్చిపడే వేలాది సైట్లలో ప్రమాదకరమైన వెబ్ సైట్లు వస్తాయన్న చేదు నిజాన్ని ఒప్పుకుంది.

గూగుల్ సెర్చ్ టూల్ వినియోగించే వేళ.. సమాచారం అందించేందుకు పలు సైట్లు దర్శనమివ్వటం తెలిసిందే. ఇలా కనిపించే వెబ్ సైట్లలో ఏ మాత్రం సెక్యూర్డ్ కాని వెబ్ సైట్లు చాలానే వస్తాయని.. వాటిని ఓపెన్ చేస్తే వైరస్ లు సిస్టమ్ లోకి ఎక్కి వినియోగదారుల సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందన్న విషయాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతానికి ఉన్న ఈ ఇబ్బంది తాత్కాలికమేనని.. తర్వలో దీన్నిఅధిగమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పేర్కొంది. ఏమైనా.. ఇప్పటికైతే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను వినియోగించటం ప్రమాదంతో కూడుకున్న ప్రయత్నమన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు