గోల్ఫ్ ఆడుకుంటున్న ఆంధ్ర మాజీ సీఎం

గోల్ఫ్ ఆడుకుంటున్న ఆంధ్ర మాజీ సీఎం

ఆయనో క్రికెటర్.. బ్యాటు పట్టి ఫోర్లు.. సిక్సర్లు కొట్టగలరు! అంతేకాదు ఆయనో స్పీకర్! విపక్ష, అధికార సభ్యుల మధ్య సమన్వయ కర్తగా మంచి ఇన్నింగ్స్ ఆడారు!! అందుకే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. కష్టకాలంలో కాంగ్రెస్ అనే జట్టును ఆదుకుంటాడని.. నమ్మిన అధిష్టానం .. ఆ జట్టుకు కెప్టెన్గా అంటే సీఎంగా బాధ్యతలు అప్పగించింది. అయితే విభజన సమయంలో అధిష్టాన నిర్ణయాన్ని ఆయన గట్టిగా ధిక్కరించారు! రాష్ట్ర విభజనను సాధ్యమైనంత వరకూ ఆపాలని పోరాటం చేశారు! కానీ అధిష్టానం తన మాట వినలేదు. కానీ సమైక్యాంధ్ర హీరో అనిపించుకున్నారు. ఆయనే నల్లారి కిరణ్కుమార్ రెడ్డి! విభజన జరిగింది. మరి ఆయన ఎక్కడున్నట్లు? ఏ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నట్లు? అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. ఇప్పుడు ఆయన క్రికెట్ బ్యాట్ వదిలేసి.. గోల్ఫ్ ఆడే బ్యాట్ పట్టారట.

ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారు? అందరికీ వచ్చే డౌటే ఇది. సమయం, సందర్భం చూసుకుని ఏదో ఒక పార్టీలో చేరుతారు అని ఆయన గురించి మనకు మీడియా అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తోంది. రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించిన కిరణ్.. తరువాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టి పోటీచేశారు. కానీ ప్రజలు ఆదరించలేదు. ఈ పార్టీ ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆయన సొంత నియోజకవర్గం పీలేరు మాత్రమే ఆ పార్టీకి డిపాజిట్లు దక్కాయి.

 ఎన్నికల్లో జైసపా ఓడిపోయాక ఆయన మౌనం దాల్చారు. మొన్నామధ్య బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగినా.. అదీ సక్సెస్ కాలేదు. అందుకే ఇక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారట. అయితే ఈమధ్య కొత్త ఇన్నింగ్స్ కు తెరతీశారు. సమైక్యాంధ్ర సీఎంగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా అడపాదడపా క్రికెట్ బ్యాట్ పట్టి ఎక్కడో ఓ చోట కనిపించే కిరణ్రెడ్డి..ఈ మధ్య ఎక్కువ ఖాళీ సమయం దొరకడంతో, గోల్ఫ్ మైదానంలో గడుపుతున్నారట. అయితే రోజులో ఎక్కువ సమయం గోల్ఫ్ ఆడుతూ గడిపేస్తుండటంతో .. గోల్ప్ ఆడేందుకు రోజూ వస్తున్న ఓ ఉత్తరాది పెద్దమనిషికి డౌటొచ్చిందట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా `మీరు ఎక్కువ సమయం గోల్ఫ్ ఆడుతూ

గడిపేస్తున్నారు..బతకడానికి ఏం చేస్తుంటారు` అని ప్రశ్నించాడట. అయితే ఏదో సమాధానం ఆశించిన ఉత్తరాది పెద్దమనిషికి చిరునవ్వుతోనే సమాధానమిచ్చారట కిరణ్!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు