బొత్స జిల్లాలోనే షాక్ ఇవ్వనున్న టీడీపీ

బొత్స జిల్లాలోనే షాక్ ఇవ్వనున్న టీడీపీ

వైసీపీలో కీలక నేతగా ఉన్న పీసీసీ మాజీ అధ్యకుడు బొత్స సత్యనారాయణకు మరో షాక్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ రెడీ అవుతోంది. ఇప్పటికే బొబ్బిలి రాజులతో రాయభారం నెరిపి పార్టీ మారేందుకు వేదిక కూడా డిసైడ్ చేసిన టీడీపీ త్వరలో ఇంకో భారీ నాయకుడికి లాగేందుకు రెడీ అవుతోంది. విజయనగరం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి ఆ టార్గెట్లో ఉన్నారని తెలుస్తోంది.

ఇటీవల బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు సోదరుడు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ బేబీనాయన ఎమ్మెల్సీ కోలగట్లను సంప్రదించినట్టు సమాచారం. జిల్లాలోని బొబ్బిలి రాజులతోపాటు కోలగట్లతో సహా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించేందుకు లోకేష్ నాయకత్వంలో సుమారు మూడు నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే బొబ్బిలి రాజులు పార్టీ మారనున్నట్టు ఇప్పటికే ప్రకటిం చారు. వీరితోపాటే కోలగట్లను కూడా రాబట్టుకునేందుకు టిడిపి నుంచి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టిడిపిలో చేరేందుకు బొబ్బిలి రాజులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 20న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబినాయన చేరేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారితో పాటు కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, ఎంపిపిలకు కూడా చంద్రబాబు సమక్షంలోనే టిడిపి కండువా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బొబ్బిలి నియోజక వర్గం నుంచి 20 బస్సుల్లో ముందు రోజు విజయవాడ వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా జగన్ బలోపేతం చేయాలనుకునన జిల్లాలనే టీడీపీ సైతం టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English