వాళ్ళిద్దరు ఔట్‌, వీళ్ళేమవుతారు?

వాళ్ళిద్దరు ఔట్‌, వీళ్ళేమవుతారు?

కేంద్రంలోని మంత్రులు పవన్‌కుమార్‌ బన్సల్‌, అశ్వనికుమార్‌ మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల వ్యవహారం చర్చకు వస్తోన్నది. కేంద్రంలో అవినీతికి కాంగ్రెస్‌ దూరంగా ఉంటుందన్న సంకేతం ఇవ్వడానికి అధిష్టానం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు కేంద్ర మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగించింది.

అదే ట్రిక్కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకూ వర్తింపజేయాలని కాంగ్రెసు అధిష్టానం భావించేచేస్తున్నదని, ఈ నేపధ్యంలో జగన్‌ కేసులో అభియోగాలు ఎదుర్కుంటున్న మంత్రులకు గండం రావచ్చని ప్రచారం జరుగుతోంది. ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీ తో కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీ గులాం నబీ అజాద్‌ భేటీ అవడంతో ఈ విషయంపై ప్రచారం మొదలైంది.

ఇదిలా ఉండగా సీనియర్‌ నేత వి.హనుమంతరావు కేంద్ర మంత్రుల రాజీనామాపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా మంత్రులను తొలగించాలని డిమాండు చేశారు. వి.హెచ్‌. చెప్పేది బాగానే ఉంది. కాని అది కిరణ్‌ చేతులలో ఉందా? చేస్తే గీస్తే అధిష్టానమే ఆ పనని చేయాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు