జ్యోతుల ప్లేస్‌లోకి ఆయ‌న వ‌చ్చేస్తున్నాడు

జ్యోతుల ప్లేస్‌లోకి ఆయ‌న వ‌చ్చేస్తున్నాడు

వైఎస్ఆర్‌సీపీ శాస‌న‌స‌భాప‌క్ష ఉప నేత, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు ఆ పార్టీ చేప‌ట్టిన ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌చ్చాయి. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా నెహ్రూ రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఒకింత వేగంగా స్పందించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఇన్ని రోజులు  పార్టీ జిల్లా అధ్యకుడిగా బాధ్యతలు నిర్వహించిన జ్యోతుల‌ పార్టీని వీడటంతో ఖాళీ అయిన స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చేందుకు జగన్ సముఖంగా ఉన్నారట. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరు ఖరారైందని, అతి త్వరలో ఆయన పేరు అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వివిధ కమిటీల నేతలతో లోటస్ పాండ్‌లో సమావేశమైన జగన్, తదుపరి అధ్యక్షుడి ఎంపికపై సమాలోచనలు చేసినట్లు, ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి చివరకు కన్నబాబు పేరును ఖరారు చేశారని సమాచారం. ఈ నేప‌థ్యంలో
కుర‌సాల కన్నబాబుకు త్వ‌ర‌లోనే జిల్లా ర‌థ‌సారథి బాధ్యతలను అప్పగించనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు