ఎన్టీఆర్ మెమోరియల్ ను ముట్టుకోరట

ఎన్టీఆర్ మెమోరియల్ ను ముట్టుకోరట

హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం పక్కన హుస్సేన్ సాగర్ సమీపంలో అంబేద్కర్ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఏకంగా 35 ఎకరాల్లో ఈ స్మారక కేంద్ర ఏర్పాటవుతుందని.. 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్స్ ఇక కనిపించదేమో అన్న ఊహాగానాలు వినిపించాయి. ఎన్టీఆర్ స్మారక కేంద్రం కూడా ఉనికిని కోల్పోతుందేమ అన్న మాటలు కూడా వినిపించాయి. ఐతే ఎన్టీఆర్ మెమోరియల్ ఉన్న 4 ఎకరాల జోలికి ప్రభుత్వం వెళ్లదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు.

ఎన్టీఆర్ స్మారక కేంద్రాన్ని ముట్టుకోకుండా ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఉన్న పార్టీ జోన్‌లో 125 అడుగుల అంబేడ్కర్ క్యాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.ఎన్టీఆర్ గొప్ప నాయకుడని.. తమ ప్రభుత్వానికి ఆయనంటే గౌరవముందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ గార్డెన్స్, పక్కనున్న ప్రాంతం మొత్తం కలుపుకుని 39 ఎకరాలుంటే.. ఎన్టీఆర్ స్మారక కేంద్రం ఉన్న 4 ఎకరాలను మినహాయించి.. మిగతా 35 ఎకరాల పరిధిలో అంబేడ్కర్ స్క్వేర్‌ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 14న అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ విగ్రహ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14కల్లా అంబేడ్కర్ విగ్రహాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English